బ్రిటిష్ విమానంపై గద్దల మూకుమ్మడి దాడి.. విధ్వంసం!

Header Banner

బ్రిటిష్ విమానంపై గద్దల మూకుమ్మడి దాడి.. విధ్వంసం!

  Fri Nov 17, 2017 21:30        India, Telugu

గాల్లో ఎగురుతున్న విమానాన్ని పక్షి ఢీకొన్న సందర్భాలను చూసే ఉంటాం. ఈ కారణంగా విమానాన్ని మార్గమధ్యంలో దించేసిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఈ ఘటన కొంచెం డిఫరెంట్. ఇంగ్లండ్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి అమెరికా బయలుదేరిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంపై గద్దలను పోలి ఉన్న వింత పక్షుల గుంపు దాడి చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. వందల సంఖ్యలో దాడిచేయడంతో పైలట్ అదిరిపోయాడు. సిబ్బంది హడలిపోయారు. కాక్‌పిట్‌లోకి చొచ్చుకెళ్లిన పక్షులు సిబ్బందిపైనా దాడి చేశాయి. విమానం వేగానికి కొన్ని పక్షులు చనిపోయి వాటి శరీర భాగాలు విమానంలో చెల్లాచెదురుగా పడ్డాయి. కాక్‌పిట్ రక్తసిక్తమైంది. పక్షుల దాడితో ఏం చేయాలో పాలుపోని పైలట్ చేసేది లేక విమానాన్ని చైనాలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ కారణంగా విమాన సర్వీసును రద్దు చేశారు. వారం రోజుల క్రితమే ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.

విమానాన్ని ఎయిర్‌పోర్టులో నిలిపిన అధికారులు చిక్కుకుపోయిన బ్లాక్ బర్డ్స్‌ను తొలగించేందుకు నానా కష్టాలు పడ్డారు. కొన్ని గంటల ప్రయత్నం తర్వాత వాటిని తొలగించగలిగారు. చనిపోయిన పక్షుల రక్తమాంసాలతో విమానం, రన్‌వే రక్తసిక్తమైంది. విమానం కాక్‌పిట్ సహా కొన్ని భాగాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై బ్రిటిష్ ఎయిర్‌వేస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఈ మార్గంలో ప్రయాణించే ప్రతి 12 విమానాల్లో ఒకదానిపై ఈ దాడి జరుగుతోందని పేర్కొన్నారు. ఈ ఘటన తమకు ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు.   బ్రిటిష్ విమానంపై గద్దల మూకుమ్మడి దాడి.. విధ్వంసం!