హలో టీజర్‌ విడుదల..

Header Banner

హలో టీజర్‌ విడుదల..

  Thu Nov 16, 2017 21:11        Cinemas, Telugu, India

 


అక్కినేని యంగ్‌ హీరో అఖిల్‌ కొత్త సినిమా హలో టీజర్‌ కాసేపటి క్రితం విడుదలైంది. మనం ఫేమ్‌ విక్రమ్‌ కే కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్‌ సన్నివేశాలతో,  చిన్నతనంలో విడిపోయిన ఇద్దరు స్నేహితులు.. పెద్దయ్యాక ఆ అమ్మాయిని వెత్కుకుంటూ అన్వేషణ కొనసాగించే యువకుడి పాత్రలో అఖిల్‌ కనిపించబోతున్నాడని హింట్ ఇచ్చేశారు. టీజర్‌కు తగ్గట్లు అనూప్‌ రూబెన్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్‌ ఆకట్టుకుంది. జగపతి బాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ 22న హలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

 


   హలో టీజర్‌ విడుదల..