కేసీఆర్‌తో లగడపాటి భేటీ

Header Banner

కేసీఆర్‌తో లగడపాటి భేటీ

  Wed Nov 15, 2017 22:26        India, Telugu

: విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాలంటూ శుభలేఖను అందించారు. సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ లగడపాటిని కుశలప్రశ్నలు వేశారు. రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్, లగడపాటి పోటాపోటీ ఉద్యమాలను నడిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడాలని కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తే లగడపాటి కూడా ఆమరణ దీక్ష చేపట్టారు. పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే కొట్టి కలకలం రేపిన లగడపాటి రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. ఆ తర్వాత తన మనోభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రం విడిపోవడంతో లగడపాటి రాజకీయాలనుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్, లగడపాటి ఇలా కలుసుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.   కేసీఆర్‌తో లగడపాటి భేటీ