ప్రియుడితో సెరెనా వివాహం.. ఘనంగా ఏర్పాట్లు

Header Banner

ప్రియుడితో సెరెనా వివాహం.. ఘనంగా ఏర్పాట్లు

  Wed Nov 15, 2017 22:18        India, Telugu

 ప్రపంచ టెన్నీస్ క్వీన్ సెరెనా విలియమ్స్ పెళ్లి కూతురు కానుంది. తన ప్రియుడు అలెక్సిస్ ఒహనియన్‌తో సెరెనా వివాహం గురువారం జరగనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకకు కొద్దిమంది ప్రముఖులు హాజరవుతున్నారని సమాచారం. న్యూఆర్లీన్స్‌లోని కాన్‌టెంపరరీ ఆర్ట్స్‌ సెంటర్‌‌లో జరగనున్న ఈ వేడుక కోసం దాదాపు రూ. 6 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 2015 నుంచి సెరెనా, అలెక్సిస్ సహజీవనం చేస్తున్నారు. కాగా ఈ ఏడాది జనవరిలో తాను గర్భవతినంటూ సెరెనా ప్రకటించింది. రెండు నెలల క్రితం అంటే.. సెప్టెంబర్ 1న సెరెనా పండంటి బిడ్డకు జన్మనించింది. ఆ చిన్నారికి అలెక్సిస్ ఒలంపియా అని పేరు కూడా పెట్టారు. 36 ఏళ్ల సెరెనా టెన్సీస్‌లో 23 గ్రాండ్‌స్లామ్‌లు సాధించి లెజెండ్‌గా నిలిచింది. తనకంటే రెండేళ్లు చిన్నవాడైన, రెడిట్‌ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఓహనియన్‌తో ప్రేమలో పడింది. దాదాపు మూడేళ్ల వీరి సహజీవనాన్ని పెళ్లిబందంగా మారుస్తూ.. మరికొన్ని గంటల్లో అధికారికంగా దంపతులు కానున్నారు.   ప్రియుడితో సెరెనా వివాహం.. ఘనంగా ఏర్పాట్లు