చంద్రబాబు మంచి రాజకీయ వేత్త: గుణశేఖర్

Header Banner

చంద్రబాబు మంచి రాజకీయ వేత్త: గుణశేఖర్

  Wed Nov 15, 2017 22:13        India, Telugu

సీఎం చంద్రబాబు మంచి రాజకీయ వేత్త అని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. 2014,15,16 నంది అవార్డులపై ఆయన మాట్లాడుతూ ‘‘చంద్రబాబు ప్రజల మనిషి, ఏ ఒక్కరికో చెందిన వ్యక్తి కాదని, మనందరికి చాలా అత్యంత అభిమాన ముఖ్యమంత్రి. అప్పట్లోనే విజన్ 20-20అని, ఆయనకున్న ఐటీ విజన్‌తో ముందుకు సాగారు. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేది మనందరి తెలుసు. నేను కూడా వాటన్నింటిని ఫాలో అయిన వాడిని. ఆయన్ని అభిమానించేవాళ్లలో నేనూ ఒకడిని. నా మీద కక్ష కట్టే అంత తీరిక ఆయనకు ఎక్కడ ఉంటుంది. ఆయన ఎందుకు కక్ష కడతారు..?. ఎక్కడో ఏదో సమాచారం లోపం జరిగింది. అదికూడా నాకెందుకు కరెక్ట్ గా మళ్లీ నాకు నేనే సమాచారం లోపం కూడా కాదు అని అనిపిస్తుదంటే.. మంత్రులు అయ్యన్న, గంటా శ్రీనివాస్ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరి సమాచారం లోపం కాదు. కచ్చితంగా నా మీద కక్ష కట్టే అంత మనిషి కాదు. బాలకృష్ణకూ, నాకూ ప్రత్యేకంగా సన్నిహిత సంబంధాలు లేవు. కానీ ఆయన్ని నేను ఎంతో అభిమానిస్తా. నంది అవార్డులు వాటి ప్రమాణాలు ఇవన్నీ కొత్త కాదు. నా మొదటి చిత్రం లాఠీకి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటివరకూ వ్యక్తిగతంగా 8 నంది అవార్డులు వచ్చాయి. విమర్శలు ఎప్పుడూ వస్తుంటాయి. కొత్తేమీ కాదు. కాకపోతే కొన్ని సార్లు ఏంటో చాలా కొట్టొచ్చినట్లు కన్పిస్తున్నాయి. ఏంటి..బహుశా మూడు సంవత్సరాలు ఒకేసారి ఎనౌన్స్ చేయడం వల్ల ఇలా జరిగిందని అనుకుంటున్నా’’ అని అన్నారు.   చంద్రబాబు మంచి రాజకీయ వేత్త: గుణశేఖర్