కువైట్ లో పెరాలిసిస్ గురైన కడప జిల్లా సుండుపల్లి వాసి ని క్షేమంగా ఇంటికి పంపిన గల్ఫ్ రాయల సీమ అసోసియేషన్

Header Banner

కువైట్ లో పెరాలిసిస్ గురైన కడప జిల్లా సుండుపల్లి వాసి ని క్షేమంగా ఇంటికి పంపిన గల్ఫ్ రాయల సీమ అసోసియేషన్

  Wed Nov 15, 2017 21:55        Telugu, India

కువైట్ లో గత కొద్ది రోజులుగా  ఫర్వానియా ఆసుపత్రిలో పెరాల్సిస్ గురై  ఇంటికి వెళ్లడానికి ఏ ఆధారం లేకుండా ఆసుపత్రిలో నిశ్ఛాయస్ధితిలో వున్న  కడప జిల్లా సుండుపల్లె వాసి పోతు రామయ్య పరిస్థితిని వారి బంధువు కృష్ణయ్య ద్వారా తెలుసుకొని గల్ఫ్ రాయలసీమ అసోసియేషన్ కువైట్ అధ్యక్షుడు దుగ్గి గంగాధర్ గారు ఆ వ్యక్తి ని పరామర్శించగా తను కువైట్ 15 సంవత్సరాలుగా వుంటున్నాని గత నాలుగు సంవత్సరాలుగా తన యజమాని అకామా కొట్టకుండ వుండటంతో  బయట పనులు చేస్తూ జీవనం సాగిస్తుండగా బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడ్డాడు  తర్వాత పెరాల్సిస్ సోకింది తను ఎలాగైనా ఇండియాకు పంపిస్తే అక్కడ వైద్యం చేయించుకుంటానని తెలుపగా దుగ్గి గంగాధర్ గారు ఈయన పరిస్థితిని ఇండియా ఎంబస్సీ కి తెలియజేసి ఆయనను ఇండియాకు వెళ్లడానికి ఎంబస్సీ తరపున టికెట్ ఏర్పాటు చేయించి తోడుగా వెళ్లడానికి ఆయన భార్యకు కూడా ఎంబస్సీ తరపునే టికెట్టు  ఏర్పాటు చేశారు అలాగే ఆసుపత్రి బిల్లులు కూడా పూర్తి మాఫీ చేయించి ఆయనను ఏ ఇబ్బంది లేకుండా ఇండియా కు పంపడం జరిగింది .

 

ఈ సందర్భంగా కువైట్ ఆంధ్ర తెలుగు న్యూస్ తో మాట్లాడిన గంగాధర్ గారు

పోతు రామయ్య విషయంలో అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ఇండియా ఎంబస్సీ కి మరియు  కువైట్ ప్రభుత్వానికి  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు   కువైట్ లో పెరాలిసిస్ గురైన కడప జిల్లా సుండుపల్లి వాసి ని క్షేమంగా ఇంటికి పంపిన గల్ఫ్ రాయల సీమ అసోసియేషన్