జియో దెబ్బకు ఊడిపోతున్న ఉద్యోగాలు

Header Banner

జియో దెబ్బకు ఊడిపోతున్న ఉద్యోగాలు

  Wed Nov 15, 2017 21:33        India, Technology, Telugu

జియో ఎఫెక్ట్ టెలికాం కంపెనీ ఉద్యోగులపై కూడా పడింది. భారీ ఆఫర్లతో మంచి జోరుమీదున్న జియో.. ఇతర నెట్ వర్క్ కస్టమర్లందర్నీ లాగేసుకుంటోంది. ఈ దెబ్బతో ఇతర నెట్ వర్క్ లన్నీ కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా నెట్ వర్క్ లలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్ కూడా అంధకారంలోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం టెలికాం పరిశ్రమలలో 3 లక్షల మంది పని చేస్తుండగా వారిలో 75వేల మంది ఉద్యోగులు ఖాళీ అయ్యారు. దీంతో 2.25 లక్షలకు ఉద్యోగుల సంఖ్య కుంచించుకుపోయింది. పరిశ్రమ వదిలేసిన వారిలో 30 శాతం మంది మిడిల్ మేనేజ్ మెంట్ విభాగం వారే. పైగా ఉన్నవారికి కూడా సంవత్సరం నుంచి జీతాలు పెంచలేదు.

 

పైగా కంపెనీ మొత్తం ఖర్చులో మానవ వనరులను భరించే స్థితిలో కూడా లేకపోవడంతో ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. కొన్ని సంస్థలైతే 3 నుంచి 6 నెలల జీతాన్ని ప్యాకేజీగా ఇచ్చి ఉద్యోగులను బయటకు పంపుతున్నారు. ప్రస్తుతం టెలికాం రంగం రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నట్లు సమాచారం. గతేడాది జియో రాకతో కంపెనీల రాబడి, లాభాలు, నగదు రాక ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యూరార్ విలీన దిశగా ఉన్నాయి. ఇప్పటికే ఐడియా, వొడాఫోన్, ఎయిర్ టెల్ తమ టవర్ల సంస్థలను విక్రయానికి పెట్టేశాయి.

 


   జియో దెబ్బకు ఊడిపోతున్న ఉద్యోగాలు