భారత్‌లో అమెరికా రాయబారిగా కెన్నెత్ ప్ర‌మాణ‌స్వీకారం..

Header Banner

భారత్‌లో అమెరికా రాయబారిగా కెన్నెత్ ప్ర‌మాణ‌స్వీకారం..

  Tue Nov 14, 2017 21:50        India, Telugu

ఆర్థిక వ్యవహారాల నిపుణుడు కెన్నత్‌ జస్టర్‌ భారత్‌లో అమెరికా రాయబారిగా వాషింగ్టన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. పరస్పరం మేలు చేసేలా ఇరుదేశాల మధ్య శక్తిమంతమైన భాగస్వామ్యాన్ని జస్టర్‌ నెలకొల్పుతారని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌పెయిన్స్‌ ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు. రిచర్డ్‌వర్మ స్థానంలో కెన్నెత్‌జస్టర్‌ భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. డొనాల్డ్‌ ట్రంప్‌ జనవరి 20న అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినప్పుడే రిచర్డ్‌ రాజీనామా చేయడంతో అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. నవంబరు 2న జస్టర్‌ నియామకానికి యూఎస్‌ సెనెట్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. 



   భారత్‌లో అమెరికా రాయబారిగా కెన్నెత్ ప్ర‌మాణ‌స్వీకారం..