నాన్న గుర్తొచ్చేవారు.. నాగార్జున భావోద్వేగం

Header Banner

నాన్న గుర్తొచ్చేవారు.. నాగార్జున భావోద్వేగం

  Mon Nov 13, 2017 21:17        Cinemas, India, Telugu

'మనం' సెట్ చూసినప్పుడల్లా నాన్న గుర్తొచ్చేవారని నటుడు నాగార్జున భావోద్వేగానికి గురయ్యారు. అగ్నిప్రమాద ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని నాగార్జున తెలిపారు. సకాలంలో ఫైర్‌ సిబ్బంది మంటలార్పారని, 'మనం' సినిమా కోసం సెట్‌ వేసినప్పుడు రూ.2 కోట్లపైనే ఖర్చయ్యిందని చెప్పారు. ‘‘నాన్నతో నటించిన సినిమా కావడంతో సెట్‌ను చూసినప్పుడల్లా గుర్తొచ్చేవారు. సెట్‌ పూర్తిగా కాలిపోవడం చాలా బాధగా ఉంది. ‘రాజుగారిగది’తో పాటు పలు సినిమాలకు ఈ సెట్‌లోనే షూటింగ్ చేశాం’’ అని నాగార్జున వివరించారు.

 

అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన ‘అన్నపూర్ణ’ సినీ స్టుడియోలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఓ సెట్‌లో చెలరేగిన మంటలు కొద్ది సేపటికే భారీగా విస్తరించడంతో సమీపంలో ఉన్న ‘మనం’ సినిమా సెట్ కూడా అగ్నికి ఆహుతైంది. అక్కినేని ఫ్యామిలీ మూడు తరాలు కలిసి నటించిన ‘మనం’ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా అయిన ‘మనం’ అక్కినేని ఫ్యామిలీ సినిమాలకు నిండుదనం తెచ్చిపెట్టింది.

 


   నాన్న గుర్తొచ్చేవారు.. నాగార్జున భావోద్వేగం