సౌదీలో లెబనాన్ ప్రధాని కిడ్నాప్!

Header Banner

సౌదీలో లెబనాన్ ప్రధాని కిడ్నాప్!

  Sun Nov 12, 2017 21:00        India, Telugu

అధికారిక పర్యటన కోసం సౌదీ అరేబియా వెళ్లిన లెబనాన్ ప్రధాని సాద్ హరరి తన రాజీనామాను ప్రకటించిన తర్వాతి రోజు నుంచి కనిపించకుండా పోవడం సంచలనం సృష్టిస్తోంది. హరిరి గతవారం సౌదీ వెళ్లగా ఆ తర్వాతి రోజే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి కలకలం రేపారు. అనూహ్యంగా ఆ తర్వాతి రోజు నుంచి ఆయన జాడ కనిపించకుండా పోయింది. దీంతో లెబనాన్ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సౌదీలో హరిరి కిడ్నాప్ అయ్యారంటూ వార్తలు రావడంతో లెబనాన్ అధ్యక్షుడు మైఖెల్ అవాన్ సౌదీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. సౌదీ వచ్చిన తమ ప్రధాని ఇప్పటి వరకు స్వదేశానికి ఎందుకు చేరుకోలేదో చెప్పాలని కోరారు.

 

సౌదీ పర్యటనకు వెళ్లిన హరిరి ఈనెల 4న రియాద్‌లో మాట్లాడుతూ తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. లెబనాన్‌పై ఇరాన్ ఆధిపత్యం కారణంగా తన ప్రాణానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రకటన తర్వాత ఆయన తిరిగి లెబనాన్ వెళ్లకపోగా ఆయన జాడ కూడా తెలియరాలేదు. దీంతో లెబనాన్‌లో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి.

 


   సౌదీలో లెబనాన్ ప్రధాని కిడ్నాప్!