ఆ ఒక్క కారణంతో ఈ హీరోయిన్ తో ఓ డైరెక్టర్..

Header Banner

ఆ ఒక్క కారణంతో ఈ హీరోయిన్ తో ఓ డైరెక్టర్..

  Sun Nov 12, 2017 20:49        India, Telugu

తెలుగు సినిమాల్లో ఇప్పుడు తెలుగు అమ్మాయిలే కరువయిపోయారు. అలాంటిది ఓ హీరోయిన్ కు తెలుగమ్మాయి అనే ఒకే ఒక్క కారణంతో ఏరికోరి అవకాశం ఇచ్చాడట ఓ రైజింగ్ డైరెక్టర్. ఆకట్టుకునే అందాన్ని సొంతం చేసుకున్న అనీషా ఆంబ్రోస్ 'అలియాస్ జానకి' సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే హీరోయిన్‎గా మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీకి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో పిలిచి సినిమా ఇచ్చాడు. అయితే 'సర్దార్ గబ్బర్ సింగ్'లో హీరోయిన్‎గా నటించాల్సిన ఈ భామకు తృటిలో ఆ ఆఫర్ తప్పిపోయింది.

 

పవర్ స్టార్ ఆఫర్ పోయినా సందీప్ కిషన్ 'రన్', చంద్ర శేఖర్ ఏలేటి 'మనమంతా', వంశీ 'ఫ్యాషన్ డిజైనర్' వంటి సినిమాల్లో హీరోయిన్‎గా నటించే ఛాన్స్ దక్కించుకుంది అనీషా. అయితే ఈ సినిమాలేవీ అమ్మడికి విజయాల్ని అందించలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్య 'ఉన్నది ఒకటే జిందగీ' వంటి చిత్రంలో చిన్న రోల్ లోనూ నటించింది ఈ వైజాగ్ భామ. దీంతో హీరోయిన్‎గా అనీషా ఆంబ్రోస్ పనైపోయింది అనుకుంటోన్న సమయంలో 'పెళ్లిచూపులు' డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ ముద్దుగుమ్మను హీరోయిన్‎గా ఎంపిక చేసుకున్నాడట.

 

'పెళ్లి చూపులు' వంటి చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు తన తర్వాతి సినిమాని రూపొందించబోతున్నాడు. ఈ సినిమాలో 'వెళ్లిపోమాకే' చిత్రంలో నటించిన విశ్వక్సేన్ హీరోగా నటిస్తుండగా అనీషా ఆంబ్రోస్‎ను హీరోయిన్‎గా ఎంపిక చేసుకున్నాడట. ఇంతకీ విషయమేమిటంటే తెలుగమ్మాయి కాబట్టే అనీషాను ఏరికోరి ఈ చిత్రంకోసం ఎంపిక చేసుకున్నాడట తరుణ్ భాస్కర్. మొత్తంమీద తరుణ్ భాస్కర్ సినిమాయైనా అనీషాకు మంచి హిట్ అందిస్తుందేమో చూడాలి.


   ఆ ఒక్క కారణంతో ఈ హీరోయిన్ తో ఓ డైరెక్టర్..