ప్రారంభమైన ‘బాలోత్సవ్‌-2017’

Header Banner

ప్రారంభమైన ‘బాలోత్సవ్‌-2017’

  Sun Nov 12, 2017 20:35        India, Telugu

‘బాలోత్సవ్‌-2017’ ఆదివారం గుంటూరులో ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఉపకులపతి రాజేంద్రప్రసాద్‌, ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు విజయభాస్కర్‌, నైపుణ్యాభివృద్ధి సంస్థ సమన్వయ కర్త సాంబశివరావు, వీవీఐటీ ఛైర్మన్‌ వాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల్లో సృజనాత్మకత, మానసిక ఉల్లాసం వెలికి తీసే లక్ష్యంతో జాతీయస్థాయిలో ఈనెల 14 వరకు జరగనున్న బాలోత్సవానికి సుమారు 12వేల మంది విద్యార్థులు తరలివచ్చారు. 20 అంశాల్లో 36 విభాగాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నారు. 1991లో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ప్రారంభమైన బాలోత్సవ్‌ కార్యక్రమాన్ని నవ్యాంధ్రలోని గుంటూరులో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. 
   ప్రారంభమైన ‘బాలోత్సవ్‌-2017’