కృష్ణా న‌దిలో బోటు ప్ర‌మాదం దిగ్ర్భాంతిక‌రం

Header Banner

కృష్ణా న‌దిలో బోటు ప్ర‌మాదం దిగ్ర్భాంతిక‌రం

  Sun Nov 12, 2017 20:31        India, Telugu

ఇబ్రహీంప‌ట్నం  ప‌విత్ర సంగమం వ‌ద్ద బోటు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డం ప‌ట్ల సిపియం రాష్ట్ర క‌మిటి తీవ్ర దిగ్ర్భాంతిని వ్య‌క్తం చేస్తున్న‌ది. వారికి సిపియం రాష్ట్ర క‌మిటి సంతాపాన్ని, వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్న‌ది. గ‌ల్లంతైన వారిని ర‌క్షించ‌డానికి యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్న‌ది. మ‌ర‌ణించినవారి కుటుంబాల‌కు 25 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల‌ని డిమాండ్చేస్తున్న‌ది. ప్ర‌యివేట్ టూరిజం బోటు ఆప‌రేట‌ర్లు కెపాసిటీకి మించి ప్ర‌యాణీకుల‌ను ఎక్కించుకోవ‌డం, ర‌క్ష‌ణ కోసం బోటులో ఉంచాల్సిన లైఫ్ జాకెట్లు అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల‌నే ఈ రోజు జ‌రిగిన ప్ర‌మాదంలో పెద్ద సంఖ్య‌లో మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న‌పై న్యాయ‌విచార‌ణ జ‌రిపించాల‌ని రాష్ట్ర క‌మిటి కోరుతుంది.

    కృష్ణా న‌దిలో బోటు ప్ర‌మాదం దిగ్ర్భాంతిక‌రం