పర్యాటక పడవ బోల్తా ఘటనలో 15కు పెరిగిన మృతుల సంఖ్య

Header Banner

పర్యాటక పడవ బోల్తా ఘటనలో 15కు పెరిగిన మృతుల సంఖ్య

  Sun Nov 12, 2017 20:28        అమరావతి కబుర్లు, India, Telugu

  కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద కృష్ణానదిలో సింపుల్ వాటర్ స్పోర్ట్ సంస్థకు చెందిన పర్యాటకుల బోటు మునిగిన ఘటనలో మృతుల సంఖ్య 15కు పెరిగింది. పడవ ప్రమాద సమయంలో మొత్తం 35మంది బోటులో ఉండగా ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 15మంది మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఐదుగురు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వారున్నారు. భవానీ ఐలాండ్ నుంచి పవిత్ర సంగమంకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మూడు మృతదేహాలను అధికారులు వెలికితీశారు. ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే మంత్రులు వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. సమీపంలోని ఆస్పత్రులకు బాధితులకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు.   పర్యాటక పడవ బోల్తా ఘటనలో 15కు పెరిగిన మృతుల సంఖ్య