టాప్ టెన్‎లో సినిమాల్లో ఎన్టీఆర్ హవా..

Header Banner

టాప్ టెన్‎లో సినిమాల్లో ఎన్టీఆర్ హవా..

  Sat Nov 11, 2017 22:25        Cinemas, India, Telugu

రోజు రోజుకు పెరుగుతోన్న మార్కెట్ పరిధి తెలుగు చిత్రాల పాలిట వరంగా మారుతోంది. ఇక టాలీవుడ్ స్టార్ హీరోల బాక్సాఫీస్ స్టామినాకు కొలమానం కూడా వారు సాధించిన కలెక్షన్ల రికార్డులే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ తెలుగులో అత్యధిక షేర్ కలెక్షన్స్ సాధించిన టాప్ టెన్ చిత్రాలపై ఓ లుక్కేద్దాం.

 

నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన చారిత్రక చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాలో శాతవాహన చక్రవర్తి శాతకర్ణిగా బాలయ్య నటనకు మంచి ప్రశంసలు దక్కడంతో పాటు ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఓవరాల్‎గా 68 కోట్ల షేర్ కలెక్షన్లతో ఈ చిత్రం టాలీవుడ్ టాప్ టెన్ మూవీస్‎లో తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది.

 

త ఏడాది విడుదలైన బన్నీ సూపర్ హిట్ 'సరైనోడు' చిత్రం 67 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు చిత్రాల్లో పదవ స్థానంలో నిలవగా మెగా ఫ్యామిలీ బాబాయ్-అబ్బాయిలైన పవన్-చరణ్ నటించిన 'అత్తారింటికి దారేది', 'మగధీర' చిత్రాలు ఏడు, ఎనిమిది స్థానాలను కైవసం చేసుకున్నాయి. పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ మూవీ 'అత్తారింటికి దారేది' లైఫ్ టైమ్ షేర్ కలెక్షన్లు 72 కోట్లు కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'మగధీర' 71 కోట్ల షేర్ వసూలు చేసింది.

 

ఇక కలెక్షన్ల విషయంలో టాలీవుడ్ టాప్ టెన్ మూవీస్ లో రెండు చిత్రాలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించినవే కావడం విశేషం. ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకొచ్చిన తారక్ ట్రిపుల్ రోల్ మూవీ 'జై లవ కుశ' 74 కోట్ల వసూళ్లతో టాలీవుడ్ టాప్ టెన్‎లో ఐదవ స్థానంలో నిలవగా గత ఏడాది ఆడియెన్స్ ముందుకొచ్చిన ఎన్టీఆర్ 'జనతాగ్యారేజ్' 73 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించి తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన ఆరవ చిత్రంగా నిలిచింది.

 

సూపర్ స్టార్ మహేశ్ బాబు సూపర్ హిట్ మూవీ 'శ్రీమంతుడు' 75 కోట్ల షేర్ కొల్లగొట్టి టాలీవుడ్ టాప్ టెన్ మూవీస్‎లో నాల్గవ స్థానాన్ని దక్కించుకోగా మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నంబర్ 150' 92 కోట్ల లైఫ్ టైమ్ షేర్ కలెక్షన్స్ సాధించి తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో మూడవ స్థానంలో నిలిచింది.

 

దర్శకధీరుడు రాజమౌళి మేగ్నమ్ ఓపస్ 'బాహుబలి' సిరీస్ చిత్రాలు రెండూ ఘన విజయాలు సాధించాయి. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ సినిమాలు తెలుగులో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలలో మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. రెండేళ్లక్రితం విడుదలైన 'బాహుబలి' ఫస్ట్ పార్ట్ 170 కోట్ల షేర్ కలెక్షన్స్‎తో తెలుగులో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో రెండవ స్థానంలో నిలవగా 'బాహుబలి' సెకండ్ పార్ట్ 'బాహుబలి ద కంక్లూజన్' ఒక్క తెలుగులోనే 270 కోట్ల షేర్ కలెక్షన్స్‎ను సాధించి ఆల్ టైమ్ తెలుగు బ్లాక్ బస్టర్స్‎లో నంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ ఏడాది 'ఇండియన్ పనోరమా'కు మెయిన్ స్ట్రీమ్ కేటగిరీలో తెలుగు నుంచి ‘బాహుబలి 2’ ఎంపికవ్వడం మరో విశేషం. ఇలా టాప్ టెన్‎లో నిలచిన చిత్రాలన్నీ థియేటర్ల ద్వారా ఈ షేర్స్ సాధించడం గమనార్హం.

 

మరోవైపు రాబోయే సంక్రాంతి నుంచి సమ్మర్ వరకూ కొన్ని బడా చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. బాలకృష్ణ 'జై సింహా', పవన్ 'అఙ్ఞాతవాసి', మహేశ్ 'భరత్ అనే నేను', అల్లు అర్జున్ 'నా పేరు సూర్య', చరణ్ 'రంగస్థలం' సినిమాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి. మరి వీటిలో ఏయే చిత్రాలు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ టెన్ లిస్ట్‎లో చోటు సంపాదించుకున్న చిత్రాలకు చెక్ పెడతాయో చూడాలి.

 


   టాప్ టెన్‎లో సినిమాల్లో ఎన్టీఆర్ హవా..