గ్రహాంతర వాసులతో మాట్లాడేందుకు యత్నాలు ముమ్మరం చేసిన చైనా

Header Banner

గ్రహాంతర వాసులతో మాట్లాడేందుకు యత్నాలు ముమ్మరం చేసిన చైనా

  Sat Nov 11, 2017 22:17        India, Telugu

గ్రహాంతర వసులతో మాట్లాడేందుకు చైనా అతిపెద్ద రేడియో డిష్‌ను సిద్ధం చేస్తోంది. 500 మీటర్ల గోళాకార టెలిస్కోప్‌ కలిగిన ఈ రేడియో డిష్ ఖగోళంలోని సూదూర ప్రాంతాలకు సిగ్నల్స్‌ను పంపగలదు. సుదూర పాలపుంతలకు సిగ్నల్స్‌ను పంపడం ద్వారా ఏలియన్స్‌ ఉనికిని తెలుసుకునేందుకు చైనా వందల కోట్ల రూపాయలను ఖర్చుచేయనుంది. చైనా ఇప్పటికే అంతరిక్ష రంగంలో తన సత్తాను చాటుకుని అగ్ర రాజ్యాలకు సవాలు విసురుతోంది. మరోవైపు గ్రహాంతర వాసులతో మాట్లాడేందుకు చైనా యత్నిస్తోందనే కథనాలు వెలువడటంతో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలియన్స్ జోలికి వెళ్లడం ప్రపంచానికి ప్రమాదకరమని స్టీఫెన్‌ హాకింగ్‌ లాంటి సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో మరికొందరు శాస్త్రవేత్తలు చైనా సాహసిక ప్రయోగాన్ని స్వాగతిస్తున్నారు.    గ్రహాంతర వాసులతో మాట్లాడేందుకు యత్నాలు ముమ్మరం చేసిన చైనా