‘జై సింహా’ అక్కడ పూర్తయింది

Header Banner

‘జై సింహా’ అక్కడ పూర్తయింది

  Sat Nov 11, 2017 22:09        Cinemas, India, Telugu

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జై సింహా’ శరవేగంగా షూటింగ్‌ని జరుపుకుంటుంది. నయనతార, హరిప్రియ, నటాషా దోషీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్‌ని తెలియజేసింది.
 
వైజాగ్‌లో 25 రోజుల పాటు జరిగిన షూటింగ్ షెడ్యూల్‌ని దిగ్విజయంగా పూర్తిచేశాము. ఈ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాం. మరో షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుంది అని చిత్ర యూనిట్ తెలియజేసింది. బాలకృష్ణ 102వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత సి. కళ్యాణ్.


   ‘జై సింహా’ అక్కడ పూర్తయింది