రెండు కాదు నాలుగు.. అద్భుతమైన ఫోన్‌ను లాంచ్ చేసిన హువేయి!

Header Banner

రెండు కాదు నాలుగు.. అద్భుతమైన ఫోన్‌ను లాంచ్ చేసిన హువేయి!

  Sat Nov 11, 2017 20:56        India, Technology, Telugu

హువేయి నుంచి మరో అద్భుతమైన ఫోన్ వచ్చేసింది. డబుల్ కెమెరా స్థానంలో నాలుగు కెమెరాలతో ఆకర్షణీయంగా ఉన్న ఫోన్‌ను హువేయి విడుదల చేసింది. ఆనర్ 9 పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ ధర రూ.17,999. మూడు రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

 

ఫీచర్లు: 5.9 అంగుళాల డిస్‌ప్లే, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ, 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, 16 ఎంపీ, 2 ఎంపీ రియర్ కెమెరాలు, 13 ఎంపీ, 2ఎంపీ సెల్పీ కెమెరాలు కలిగిన ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఓస్‌తో పనిచేస్తుంది. శక్తిమంతమైన 3340 ఎంఏహెచ్ బ్యాటరీ ఉపయోగించారు.

 


   రెండు కాదు నాలుగు.. అద్భుతమైన ఫోన్‌ను లాంచ్ చేసిన హువేయి!