భారత పర్యటనకు ముందు మెండిస్, సిల్వాలకు షాక్

Header Banner

భారత పర్యటనకు ముందు మెండిస్, సిల్వాలకు షాక్

  Sun Nov 05, 2017 22:11        India, Sports, Telugu

భారత పర్యటనకు ముందు కుశాల్ మెండిస్, కౌశల్ సిల్వాలకు శ్రీలంక క్రికెట్ బోర్డు షాకిచ్చింది. వచ్చే వారం కోల్‌కతా వేదికగా భారత్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆల్ రౌండర్లు దుశాన్ శంక, ధనుంజయ డి సిల్వాలను వెనక్కి పిలిపించిన బోర్డు కుశాల్ మెండిస్, కౌశల్ సిల్వాలను జట్టు నుంచి తప్పించింది. గాయంతో బాధపడుతున్న ఏంజెల్ మాథ్యూస్ కోలుకోవడంతో అతడు కూడా జట్టుతో కలిశాడు.

ఈ ఏడాది జూలై-సెప్టెంబరు మధ్య శ్రీలంకలో భారత్‌తో జరిగిన మొత్తం 9 మ్యాచుల్లోనూ ఆతిథ్య జట్టు ఓటమి పాలైంది. మూడు టెస్టులు, ఐదు వన్డే మ్యాచ్‌లు, ఒక టీ20 మ్యాచ్‌లో శ్రీలంకను భారత్ వైట్‌వాష్ చేసింది. కాగా, ఈ నెల 16 నుంచి 20 వరకు కోల్‌కతాలో తొలి టెస్ట్ జరగనుంది. 24న నాగ్‌పూర్‌లో రెండో టెస్టు, డిసెంబరు 2-6 మధ్య ఢిల్లీలో చివరి టెస్ట్ జరగనుంది.

 


   భారత పర్యటనకు ముందు మెండిస్, సిల్వాలకు షాక్