మున్రో శతకం.. భారత్ టార్గెట్ 197

Header Banner

మున్రో శతకం.. భారత్ టార్గెట్ 197

  Sat Nov 04, 2017 21:08        India, Sports, Telugu

భారత్‌తో జరుగుతున్న రెండో టీ-20 మ్యాచ్‌లో కివీస్ ఓపెనర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఓపెనర్లు కొలిన్ మున్రో (109), మార్టిన్ గుప్టిల్ (45) అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టు మంచి స్కోర్ అందించాడు. 12వ ఓవర్‌లో గుప్టిల్ క్యాచ్ ఔట్ అయినప్పటికీ.. మున్రో మాత్రం తన దూకుడుని కొనసాగించారు. 58 బంతుల్లో 109 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో తన వంతు సహకారం అందించాడు. దీంతో న్యూజిలాండ్ 20 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. 197 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది. భారత బౌలింగ్‌లో చహాల్, సిరాజ్ చెరో వికెట్ తీశారు.   మున్రో శతకం.. భారత్ టార్గెట్ 197