కివీస్‌ను చిత్తుగా ఓడించిన కోహ్లీసేన

Header Banner

కివీస్‌ను చిత్తుగా ఓడించిన కోహ్లీసేన

  Wed Nov 01, 2017 22:30        India, Sports, Telugu

టి20లో భారత్ నిర్దేశించిన 203 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించలేక కివీస్ చేతులెత్తేసింది. 20 ఓవర్లు ఆడి 8 వికెట్లు నష్టపోయి కేవలం 149 పరుగులు చేసింది. దీంతో భారత్ కివీస్‌ను 53 పరుగుల తేడాతో ఓడించినట్లైంది. అంతకు ముందు భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. ఆరంభంలో ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ చెలరేగి ఆడారు. ఓపెనర్ శిఖర్ ధావన్ రెండు సిక్సర్లు, పది ఫోర్లతో 80 పరుగులు చేసి అవుటయ్యాడు. రోహిత్ శర్మ నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 80 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా డకౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ మూడు సిక్సర్ల సాయంతో 26 పరుగులు, ధోనీ ఏడు పరుగులు చేశాడు.   కివీస్‌ను చిత్తుగా ఓడించిన కోహ్లీసేన