సిరీస్ మనదే... కివీస్‌ను చిత్తు చేసిన కోహ్లీసేన

Header Banner

సిరీస్ మనదే... కివీస్‌ను చిత్తు చేసిన కోహ్లీసేన

  Sun Oct 29, 2017 22:20        India, Sports, Telugu

ఫైనల్ వన్డేను భారత్ గెలుచుకుంది. ఆరు పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. 338 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలో బాగానే ఆడినా చివరకు వచ్చేసరికి న్యూజీలాండ్ తడబడింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా వీరవిహారం చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ భారత్‌కు బ్యాటింగ్ అప్పగించి తగిన మూల్యం చెల్లించుకుంది. 29 పరగుల వద్ద శిఖర్ ధవన్ (14)ను ఔట్ చేసిన ఆనందం కివీస్‌కు మిగల్లేదు. కోహ్లీ, రోహిత్ శర్మలు కలిసి న్యూజిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేశారు. 138 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 18 ఫోర్లు, 2 సిక్సర్లతో 147 పరుగులు చేసి ఔటవగా, కెప్టెన్ కోహ్లీ 106 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో వన్డేల్లో 32వ సెంచరీ నమోదు చేశాడు. అంతేకాక వన్డేల్లో అతి తక్కువ మ్యాచుల్లో 9వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. హార్ధిక్ పాండ్యా 8, ధోనీ 25, కేదార్ జాదవ్ 18, దినేశ్ కార్తీక్ 4(నాటౌట్) పరుగులు చేశారు.

కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, ఆడం మిల్నె, మిచెల్ సాంట్నర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

 


   సిరీస్ మనదే... కివీస్‌ను చిత్తు చేసిన కోహ్లీసేన