కాన్సర్! కాన్సర్! కాన్సర్! ఎలా జయించ వచ్చు... కువైట్ లో ఉచిత అవగాహనా సదస్సు నిపుణుల చే

Header Banner

కాన్సర్! కాన్సర్! కాన్సర్! ఎలా జయించ వచ్చు... కువైట్ లో ఉచిత అవగాహనా సదస్సు నిపుణుల చే

  Thu Oct 26, 2017 10:37        Associations, Health, Telugu, Kuwait

కాన్సర్! కాన్సర్! కాన్సర్! ఎలా జయించ వచ్చు... కువైట్ లో ఉచిత అవగాహనా సదస్సు నిపుణుల చే  

ప్రతి అక్టోబర్ నెల ప్రపంచ బ్రెస్ట్ కాన్సర్ నెల సందర్భం గా  28 అక్టోబర్ శనివారం నాడు కువైట్ లోని లైఫ్ అగైన్ ఆర్గనైజేషన్ అద్వర్యం లో మంగఫ్ ఏరియా లోని సంగీత ఫంక్షన్ హాల్ లో కాన్సర్ మరియు నివారణ, కాన్సర్ తో ఫైట్ అనే సబ్జెక్ట్ మీద అవగాహనా సదస్సు మరియు యోగా మరియు ధ్యానం తో ఎలా లబ్ది పొందవచ్చు అనే విషయాల మీద అవగాహన కార్యక్రమం జరుగుతుంది.

ఈ కార్యక్రమం లో వివధ రంగాలలోని నిపుణులు పై అంశాల మీద వారి అనుభవాలు మరియు నివారణ ఉపాయాలు తెలియ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పక విచ్చేసి కాన్సర్ పై అవగాహన కలిగించుకొని తమ తమ జీవన విధానాలను అందుకు తగినట్లు గా మర్చుకోనటానికి ప్రయత్నించండి.

లైఫ్ అగైన్ కువైట్ ను గతం లో సిని నటి గౌతమి గారు కువైట్ కు విచ్చేసి స్తాపించడం జరిగింది. ప్రస్తుతం అద్యక్షుడు గా కోడూరి వెంకట్, మరియు షైనీ ఫ్రాంక్, విజయ నాయర్, నితు సింగ్ కార్యక్రమ కో ఆర్దినేటేర్స్ గాను, రోషిని, అరుణ్ మరియు చప్పిడి రాజ శేఖర్ ఈవెంట్ టీం మెంబర్లు గాను వ్యవహరిస్తున్నారు.

ఈ కార్యక్రమం అనంతరం చక్కటి విందు భోజనం కూడా ఏర్పాటు చేసారు నిర్వాహకులు. ఈ కార్యక్రమాన్ని లూలూ  సెంటర్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు. కువైట్ ఎన్నారైస్ మీడియా పార్టనర్ గా వ్యవహిర్స్తున్నారు.

మరిన్ని వివరాలకు షైనీ ఫ్రాంక్ 95560540 కు లేదా విజయ నాయర్ 97300427 లను సంప్రదించండి.

ఈ వార్త కువైట్ లో ప్రతి ఒక్కరికి పనికి వచ్చేది కాబట్టి అందరికి తప్పకుండా షేర్ చేసి వారికి తెలియా చేయండి.

   కాన్సర్! కాన్సర్! కాన్సర్! ఎలా జయించ వచ్చు... కువైట్ లో ఉచిత అవగాహనా సదస్సు నిపుణుల చే