కువైట్ కంపనీ అమరావతిలో ఎల్ ఎన్ జి టెర్మినల్, గ్రీన్ ఫీల్డు క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం రెండు ఎంఓయుల మీద సంతకాలు...

Header Banner

కువైట్ కంపనీ అమరావతిలో ఎల్ ఎన్ జి టెర్మినల్, గ్రీన్ ఫీల్డు క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం రెండు ఎంఓయుల మీద సంతకాలు...

  Tue Oct 24, 2017 09:40        APNRT, Kuwait, Telugu

కువైట్ కంపనీ అమరావతిలో ఎల్ ఎన్ జి టెర్మినల్, గ్రీన్ ఫీల్డు క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం  రెండు ఎంఓయుల మీద సంతకాలు...

రాష్ట్రంలో ఎల్ ఎన్ జి టెర్మినల్, గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్  ఏర్పాటుకు సంబంధించి కువైట్ కు చెందిన అల్ అర్ఫాజ్  హోల్డింగ్ కంపెనీతో ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు రెండు ఎంవోయూలు కుదుర్చుకుంది. పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు మరో ఎంవోయూ మీద సంతకాలు చేశారు.

ఈ అవగాహనా ఒప్పందాల ప్రకారం ఏపీలో అల్ అర్ఫాజ్  హోల్డింగ్ కంపెనీ ఎల్ ఎన్ జి టెర్మినల్, గ్రీన్ ఫీల్డు క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నెలకొల్పుతుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఈ అవగాహనా ఒప్పంద పత్రాలపై ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్, అల్ అర్జాఫ్ హోల్డింగ్ కంపెనీ చైర్మన్ సౌద్ అల్ అర్ఫాజ్ సంతకాలు చేసి పరస్పరం పత్రాలు మార్చుకున్నారు.

వెల్ నెస్ రిసార్ట్స్ ప్రత్యక్ష పెట్టుబడులు $ 60 మిలియన్ డాలర్లు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్ తూర్పు ప్రాంత ప్రతినిధి షేక్ మహ్మద్ బిన్ తహనూన్ నెహయాన్ కార్యాలయంలో కుదిరిన  మరో ప్రాథమిక అవగాహనా ఒప్పందం ప్రకారం ‘వెల్ నెస్ రిసార్ట్స్’  కంపెనీ మన రాష్ట్రంలో దాదాపు  $ 60 మిలియన్ డాలర్లు ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతుంది.

షేక్ మహ్మద్ బిన్ తహనూన్ అల్ నెహయాన్  గతంలో అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరించారు. ఈ ఒప్పందం ప్రకారం ఈ పరిశ్రమలో 750 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అనుబంధ పరిశ్రమలలో మరిన్ని అవకాశాలు లభిస్తాయి. ఈ పరిశ్రమలో ఏటా 200 మందికి నైపుణ్య శిక్షణనిస్తారు. ప్రాథమిక అవగాహనా ఒప్పంద పత్రాలపై షేక్ మహ్మద్ బిన్ తహనూన్ నెహయాన్, ఏపీ ఈడీబీ సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్ సంతకాలు చేశారు.

   కువైట్ కంపనీ అమరావతిలో ఎల్ ఎన్ జి టెర్మినల్, గ్రీన్ ఫీల్డు క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం రెండు ఎంఓయుల మీద సంతకాలు...