మరో ఘోరం... విచిత్రం గా ‘వృద్ధుడి’ జననం... ఆహరలేమే కారణం...

Header Banner

మరో ఘోరం... విచిత్రం గా ‘వృద్ధుడి’ జననం... ఆహరలేమే కారణం...

  Mon Oct 23, 2017 20:22        Telugu, World

మరో ఘోరం... విచిత్రం గా ‘వృద్ధుడి’ జననం... ఆహరలేమే కారణం...

డెమాస్కస్: సిరియా దేశంలో ఒక తల్లి విచిత్రమైన శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు చూసేందుకు వృద్ధునిలా కనిపిస్తున్నాడు. ఇతని బరువు కూడా 1.9 కిలోగ్రామలే ఉండటం విచిత్రం. గర్భంలో ఉన్నప్పటి నుంచే పోషకాహార లేమి ఎదురుకావడంతో శిశువు ఇలా జన్మించాడని వైద్యులు తెలిపారు. సిరియా ప్రభుత్వానికి, ఐఎస్‌ఐఎస్‌కు మధ్య కొన్నేళ్లుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. దీంతో అక్కడి పరిస్థితులు అత్యంత ఘోరంగా దిగజారాయి. ఆకలి చావులు పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలోనే ఈ బాలుడు జన్మించాడు. సాధారణంగా అప్పడే పుట్టిన శిశువు బరువు 3.5 కిలో గ్రాములుంటుంది. అయితే ఈ శిశువు కేవలం 1.9 కిలోలు మాత్రమే ఉన్నాడు. ఈ శిశువు ఎంత బలహీనంగా ఉన్నాడంటే శరీరంలోని అన్ని ఎముకలు బయటికే కనిపిస్తున్నాయి.

   మరో ఘోరం... విచిత్రం గా ‘వృద్ధుడి’ జననం... ఆహరలేమే కారణం...