దుబాయిలో చంద్రబాబు మీటింగ్ ఒక చరిత్రకు నాంది కావాలి..మీరు ఒంటరి కాదు. మీ వెనుక ఒక రాష్ట్ర ప్రభుత్వం, మరియు చంద్రబాబు నాయుడు ఉన్నాడు... అమరావతికి ఎమిరేట్స్ కు నేరుగా విమానం... ప్రసంగ వివరాలు.

Header Banner

దుబాయిలో చంద్రబాబు మీటింగ్ ఒక చరిత్రకు నాంది కావాలి..మీరు ఒంటరి కాదు. మీ వెనుక ఒక రాష్ట్ర ప్రభుత్వం, మరియు చంద్రబాబు నాయుడు ఉన్నాడు... అమరావతికి ఎమిరేట్స్ కు నేరుగా విమానం... ప్రసంగ వివరాలు.

  Sat Oct 21, 2017 20:27        APNRT, Gulf News, Kuwait, Telugu

దుబాయిలో చంద్రబాబు మీటింగ్ ఒక చరిత్రకు నాంది కావాలి..మీరు ఒంటరి కాదు. మీ వెనుక ఒక రాష్ట్ర ప్రభుత్వం, మరియు చంద్రబాబు నాయుడు ఉన్నాడు... అమరావతికి ఎమిరేట్స్ కు నేరుగా విమానం..

నంద్యాల మనం ఓడిపోయిన సీటు గెలిచాం. అందరూ 80% తృప్తి రావాలి. రాజకీయంగా నూటికి 80% తెలుగుదేశం పార్టీనే ఉండాలి. అభివృద్ధికి సుస్థిర ప్రభుత్వం ఉండాలి నేను అందుకే మిమ్మల్ని ఒక్కటి కోరుతున్నా మీరుకూడా నా ఉద్దేశాన్ని అర్ధం చేసుకుని సహకరించండి. నేను విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను. అభివృద్ధి, ఆనందం రెండూ కావాలి. నేను ఏ పని చేసినా ప్రజల్లో ఆనందం చూస్తున్నాం. ఆనందలహరి పెట్టాం, హ్యాపీ సండే కార్యక్రమం తెచ్చాం మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో ఆహ్లాదం అంతే ముఖ్యం. కష్ట పడిన తర్వాత భార్యా బిడ్డలతో కలసి భోంచేస్తే ఆనందం మరెక్కడా లభించదు.  మీకోసం ఒక విధానం రూపొందించాం అందరూ ముందుకు రండి.

25 లక్షల ఎన్నార్టీలు ఉన్నారు. ఏపీ ఎన్నార్టీతో అనసంధానం కండి గల్ఫ్ దేశాలతో ప్రవాసాంధ్రులకు మూడు పథకాలు తెచ్చాం  స్కిల్ డెవలప్ మెంట్ ఇస్తాం. ఇప్పుడు సంపాదించినదానికంటే 2 లేదా 3 రెట్లు ఎక్కువ ఆదాయం తీసుకొచ్చే విధంగా తయారు చేస్తా మీకు సంకల్పం ఉండాలి. దుబాయిలో ఎన్నార్టీ మీటింగ్ ఒక చరిత్రకు నాంది కావాలి. మీరు ఒంటరి కాదు. మీ వెనుక ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీ వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అమరావతికి ఎమిరేట్స్ కు నేరుగా విమానం వస్తుంది. అన్ని ప్రాంతాలను కనెక్ట్ చేస్తున్నాం..

గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇమ్మిగ్రెంట్స్‌కు మా వంతు కృషిగా చేయగలిగినంత కంటే ఎక్కువ ప్రయోజనం చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నాం

ఇందుకోసమే నేను అధికారంలోకి రాగానే APNRT ని నెలకొల్పాను. గల్ఫ్ లో ఉన్న ఆంధ్రుల సమస్యలను గుర్తించి అధ్యయనం చేయమని కోరాను. వాళ్ల సమస్యల పరిష్కారానికి సూచనలు అడిగాను.

ఇక్కడ నివసించే మనవాళ్లకు సాధికారత కల్పించడం కోసం APNRT సహకారం అందిస్తోంది.   మన రాష్ట్రానికి వచ్చినా స్థిరపడాలనుకున్నా, లేదా పనిచేస్తున్న దేశాలలో ఎంటర్ ప్రెన్యూర్లుగా ఎదగడానికైనా APNRT తోడ్పడుతోంది.

మీలో అనేకమంది APNRT తో కలసి పనిచేస్తున్నారు. ఇలా APNRT లో 109 దేశాల నుంచి 45,000 మంది సభ్యులయ్యారు. సమస్యల పరిష్కారానికి, సమస్యల నిరోధానికి APNRT ఒక వేదికగా నిలిచింది.

విదేశాలల్లో ఉన్న మన రాష్ట్రం వారు దురదృష్టవశాత్తూ సమస్యల్లో ఉన్నా, ఆపదల్లో చిక్కుకున్నా వారికి తక్షణ సాయానికి బడ్జెట్ లో రూ.40 కోట్లను కేటాయించాం.

ప్రవాసాంధ్ర హెల్ప్ లైన్’ పేరుతో 24 గంటలూ సేవలందించే ఒక ‘హెల్ప్ లైన్’ ప్రారంభించాలని APNRTకి సూచించాం.

కేంద్ర, రాష్ట్ర వనరులను ఉపయోగించి   సమస్యల్లో చిక్కుకున్న వారిని గుర్తించి సహాయపడటంలో ప్రవాసాంధ్ర హెల్ప్ లైన్ లో పనిచేసే వారికి శిక్షణ అందించాం.

ప్రవాసాంధ్ర భరోసా’ పేరుతో ఒక బీమా పథకం తీసుకొచ్చాం. దురదృష్టవశాత్తు చనిపోయినా, ప్రమాదవశాత్తూ గాయపడినా, వైకల్యం సంభవించినా, జబ్బులు వచ్చినా, న్యాయపరమైన చిక్కులు ఎదురైనా ఆదుకుంటున్నాం.

మైగ్రెంట్స్ కేవలం ఏడాదికి రూ. 50 ప్రీమియం చెల్లిస్తే చాలు. మిగతాది ప్రభుత్వం చెల్లిస్తుంది. చనిపోతే రూ..10 లక్షల బీమా, రూ. లక్ష వరకు ఆరోగ్య బీమా, లీగల్ ఇన్సురెన్స్ కింద రూ.45,000 అందిస్తున్నాం. ఇక్కడ నివసించే మన రాష్ట్ర మహిళలకు  మెటర్నిటీ బెనిఫిట్స్  అందిస్తున్నాం.

ఇక్కడికి వలస వచ్చిన వారిని అత్యవసరంగా సహాయం అందించేందుకు ‘ప్రవాసాంధ్రనిధి’ ఏర్పర్చాం.

ఇక్కడ ఉన్న మన వాళ్ల నైపుణ్యాలు మెరుగుపర్చేందుకు మైగ్రెంట్ ఎకనమిక్ రిహాబిలిటేషన్ సెంటర్ స్థాపిస్తున్నాం

ఇక్కడికి వచ్చి సంపన్నులైన వారు జన్మభూమికి సహాయపడవచ్చు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీరెలా భాగస్వాములు కావచ్చో APNRT మార్గదర్శనం చేస్తుంది.


   దుబాయిలో చంద్రబాబు మీటింగ్ ఒక చరిత్రకు నాంది కావాలి..మీరు ఒంటరి కాదు. మీ వెనుక ఒక రాష్ట్ర ప్రభుత్వం, మరియు చంద్రబాబు నాయుడు ఉన్నాడు... అమరావతికి ఎమిరేట్స్ కు నేరుగా విమానం... ప్రసంగ వివరాలు.