దుబాయ్ లో తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన... APNRT మరియు తెలుగు సమాజలతో సమావేశం... గల్ఫ్ దేశాలనుండి భారీగా తరలి వెళ్ళిన తెలుగు తమ్ముళ్ళు

Header Banner

దుబాయ్ లో తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన... APNRT మరియు తెలుగు సమాజలతో సమావేశం... గల్ఫ్ దేశాలనుండి భారీగా తరలి వెళ్ళిన తెలుగు తమ్ముళ్ళు

  Sat Oct 21, 2017 18:02        APNRT, Gulf News, Kuwait, Telugu

దుబాయ్ లో తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన... APNRT మరియు తెలుగు సమాజలతో సమావేశం... గల్ఫ్ దేశాలనుండి భారీగా తరలి వెళ్ళిన తెలుగు తమ్ముళ్ళు    

దుబాయ్ నగరంలోని ఇండియన్ హైస్కూలు ఆడిటోరియమ్‌లో భారతీయ కాలమాన ప్రకారం ఈ రాత్రి 6 గంటలకు అంటే మరికొద్ది నిమిషాలలో ‘తెలుగు సమాజం’ తో రెండు గంటల పాటు జరగనున్న సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగించనున్నరు. ఈ సభను విజయవంతం చేయడానికి గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న తెలుగు తమ్ముళ్ళు, APNRT కో ఆర్డినేటర్లు నిన్ననే దుబాయ్ చేరుకున్నారు. ఈ సమావేశం లో మంత్రులు కోళ్ళు రవీంద్ర, నారాయణ, APNRT ప్రెసిడెంట్ వేమూరి రవి, మరియు ఇతరులు పాల్గొంటారు.

ఈ సమావేశాన్ని APNRT అధ్వర్యంలో APNRT UAE కో ఆర్డినేటర్లు నిర్వహిస్తున్నారు.  

ఈ సమావేశం తరువాత ముఖ్యమంత్రి రాత్రి 9 గంటలకు (IST)  బిజినెస్ లీడర్స్ ఫోరమ్ సమావేశానికి హాజరు అవుతారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు గల అవకాశాలపై దుబాయ్ పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరించనున్నారు.   దుబాయ్ లో తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన... APNRT మరియు తెలుగు సమాజలతో సమావేశం... గల్ఫ్ దేశాలనుండి భారీగా తరలి వెళ్ళిన తెలుగు తమ్ముళ్ళు