వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ వారి సహకారంతో స్వస్ధలం చేరిన పింఛ వాసి మృతదేహాం… AP NRI శాఖ ఉచిత అంబులెన్స్ చెన్నై నుండి స్వస్ధలం వరకు...

Header Banner

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ వారి సహకారంతో స్వస్ధలం చేరిన పింఛ వాసి మృతదేహాం… AP NRI శాఖ ఉచిత అంబులెన్స్ చెన్నై నుండి స్వస్ధలం వరకు...

  Thu Oct 19, 2017 12:59        Associations, Helping Hand, Kuwait, Telugu

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ వారి సహకారంతో స్వస్ధలం చేరిన పింఛ వాసి మృతదేహాం…  AP NRI శాఖ ఉచిత  అంబులెన్స్ చెన్నై నుండి స్వస్ధలం వరకు...

గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డి గారు తెలిపిన వివరాల ప్రకారం వై.యస్.ఆర్.జిల్లా రాజంపేట  నియోజకవర్గం  టి.సుండుపల్లె  మండలం   ఫింఛా  గ్రామానికి  చెందిన కళ్లప్పగారి వెంకటరమణ ( 52 ) గత 20 సం: లుగా కువైట్ ఉంటున్నారు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. భార్య కువైట్ లోనే ఉన్నారు కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగా లేక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 16 - 10 - 17 న తుది శ్వాస వదిలారు. మృతదేహాన్ని స్వస్దాలనికి పంపెందుకు సహకరించాలని బాలిరెడ్డి గారిని మృతుడి బంధువులు అభ్యర్ధన చేయగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ సేవాదళ్ ఇంచార్చ్ గోవిందు రాజు భారత దేశ రాయబార కార్యాలయం మరియు కువైట్ చట్టబద్ధమైన పనులన్నీ పూర్తి చేసి కువైట్ నుండి ఎమిరేట్స్ విమానం ద్వారా 18 - 10- 17 న మధ్యాహ్నం 2 గం: 15 నిమిషాలకు  బయలు దేరి వయా దుబాయ్ నుండి 19 - 10 -17న ఉదయం 2 గం:ల 20 నిమిషాలకు చెన్నై చేరింది. టికెట్ ఖర్చులు వెంకటరమణ బంధువులు భరించారు.

చెన్నై నుండి స్వస్ధలం వరకు కువైట్ ఎన్నారైస్ సహాకారంతో AP NRI శాఖ  అంబులెన్స్ ఉచితంగా ఏర్పాటు చేసింది. ఈ సందర్భముగా ఇలియాస్, బాలిరెడ్డి గారు మాట్లాడుతూ భారత దేశ రాయబార కార్యాలయ  అధికారులకు మరియు ఏ.పి.ఎన్.ఆర్.టి. సభ్యులకు   కమిటి సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. 

సభ ఆసుపత్రి మార్చురీలో గోవిందు రాజు, బంధువులు వెంకట రమణ పార్థివదేహాన్నిసందర్షించి నివాళిలు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలిపారు. 

   AP NRI శాఖ ఉచిత అంబులెన్స్ చెన్నై నుండి స్వస్ధలం వరకు