ఐయోవా స్టేట్ యూనివర్సిటీ సీడ్ సైన్స్ సెంటరులో మెగా సీడ్ ప్రాజెక్టు రౌండ్ టేబుల్ సమావేశం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి ప్రసంగం..

Header Banner

ఐయోవా స్టేట్ యూనివర్సిటీ సీడ్ సైన్స్ సెంటరులో మెగా సీడ్ ప్రాజెక్టు రౌండ్ టేబుల్ సమావేశం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి ప్రసంగం..

  Thu Oct 19, 2017 12:07        APNRT, అమరావతి కబుర్లు, Kuwait, Telugu, World

ఐయోవా స్టేట్ యూనివర్సిటీ సీడ్ సైన్స్ సెంటరులో మెగా సీడ్ ప్రాజెక్టు రౌండ్ టేబుల్ సమావేశం.

సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,

ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ దామోదర్ నాయుడు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, అర్థికాభివృద్ది మండలి కార్యనిర్వాహకాధికారి కృష్ణమోహన్.

ఐయోవా స్టేట్ యూనివర్సిటీలో వర్చువల్ రియాలిటీ అప్లికేషన్ సెంటర్ సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం.

అక్కడి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి బృందానికి వివరించిన వర్చువల్ రియాల్టీ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్.

 

సీడ్ పార్కుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందానికి ప్రజెంటేషన్ ఇచ్చిన ఐయోవా స్టేట్ యూనివర్శిటీకి చెందిన దిలీప్ గుంటుకు.

దిలీప్ ప్రసంగం ముఖ్యాంశాలు:

సీడ్ పార్కు డిజైన్, వివిధ అంశాలకు స్థల కేటాయింపు, లొకేషన్, శిక్షణా సదుపాయాలు, రవాణా మార్గాలు, కన్వెన్షన్ సెంటర్, ఇతర అంశాలపై వివరణ.

అంకురం నుంచి ముగింపు వరకు విత్తన విలువకు జోడింపుగా  గొలుసుకట్టు సదుపాయాలు కల్పించాలన్నదే ఈ సీడ్ పార్కు ఏర్పాటు ఉద్దేశం.

సీడ్ పార్కుకు బీజకణాలతో వచ్చిన వాళ్లు విత్తనాల ప్యాకెట్టుతో తిరిగివెళ్లాలి. 

విత్తన విధానాలు, నియంత్రణలపై జరిపే కృషిలో సహకరిస్తాం. ఎందుకంటే విత్తన విధానాలు, నియంత్రణ సరిగ్గా లేకుంటే విత్తన పరిశ్రమ, పరిశోధన రంగం సుసంపన్నం కాదు. 

.......................

ఐయోవా యూనివర్శిటీ సీడ్ పార్కు రౌండు టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగం ముఖ్యాంశాలు:

మూడు నెలల స్వల్ప వ్యవధిలో ఇక్కడికి వచ్చాను. వ్యవసాయరంగానికి, రైతాంగ సంక్షేమానికి మా ప్రభుత్వం ఎంత ప్రాధాన్యతనిస్తోందో దీన్ని బట్టే  అర్ధం చేసుకోవచ్చు.

రైతులు ఆహార పంటలను పండిస్తున్నారు. కానీ వారికి తిరిగి మంచి ఆదాయం రావటం లేదు. తగినంత లాభాలు రావడం లేదు.

గతంలో వ్యవసాయక ఆధారిత ఆర్ధిక వ్యవస్థగా ఉండే మా రాష్ట్రాన్ని విజ్ఞాన ఆధారిత ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దాను.

ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్‌లో సుస్థిర వ్యవసాయం సాధించే దిశగా కృషి చేస్తున్నాం.

రైతాంగ రుణాలను మాఫీ చేయడానికి దేశంలో ఎక్కడా, ఎప్పుడూ ఇవ్వనంత రికార్డు స్థాయిలో రూ.24 వేల కోట్ల మేర ఖర్చు చేయాలని నిర్ణయించాం.

మాకు మిగులు వనరులు లేకపోయినా, వ్యవసాయరంగం పట్ల బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకుని ధైర్యంగా ముందుకు పోగలిగాం.

వ్యవసాయ ఉత్పత్తులకు మేం అదనపు విలువను జోడించాలని భావిస్తున్నాం.

ముఖ్యంగా ఉద్యాన పంటల్ని విస్తరించి, వైవిధ్య పంట విధానాలను అనుసరిస్తున్నాం.

కాలానుగుణంగా మారిన ఆహారపుటలవాట్లను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా పంటలను పండించాలన్నదే నా ఆలోచన.

ఆహార భద్రత, విత్తన భద్రత చాలా ముఖ్యం.

‘హబ్ అండ్ స్పోక్స్’ విధానంలో సీడ్ పార్కును అభివృద్ధి చేస్తాం. కర్నూలు హబ్‌గా ఉంటుంది, మిగిలిన కేంద్రాలు దానికి అనుసంధానంగా ఉంటాయి.

ఉత్తమ విధానాలను రూపొందిస్తాం.

కేవలం రాష్ట్ర అవసరాలకే కాదు. ప్రపంచ అవసరాలు తీర్చేవిధంగా సీడ్ పార్కును తీర్చిదిద్దటం  మా ధ్యేయం.

ఇందుకోసం మీ సంపూర్ణ సహకారం కోరుతున్నాం.

అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలి.

ఈ ప్రాజెక్టు ఏ ఇబ్బందీ లేకుండా మనుగడ సాగించాలి, లాభసాటిగా ఉండాలి.

భారతప్రభుత్వం నుంచి కొంత సహాయం తీసుకుంటాం. మా సొంతంగానే కొన్ని నిధులు సమకూర్చుకుంటాం. స్థిరంగా ఈ విత్తన కేంద్రం మనుగడ సాగించాలన్నదే ఆలోచన. ప్రాజెక్టు సుస్థిరంగా కొనసాగడానికి ఇదొక్కటే చాలదు. ఉత్తమ పరిశోధనా సంస్థలు అక్కడికి రావాల్సి ఉంది. విత్తన రంగంలో ముందస్తు పరిశోధనలతో సంస్థలు ముందుకు రావాలి.

దానికి అనువైన వాతావరణాన్ని మేము కల్పిస్తాం. మంచి ఎకో సిస్టం రూపొందిస్తాం.

ఆదర్శ, అనుసరణీయ వ్యవసాయం ఎలా ఉండాలో చాటడానికి ఆంధ్రప్రదేశ్ ఒక నమూనాగా నిలవాలి. 

వచ్చే నెలలో మేం ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద సదస్సు నిర్వహించబోతున్నాం. ఈ సదస్సుకు బిల్‌గేట్స్, మిలిందా గేట్స్ రానున్నారు.

మా రాష్ట్రంలో పుష్కలంగా నీరు, విద్యుత్తు, నైపుణ్యంతో కూడిన మంచి మానవ వనరులు ఉన్నాయి. ప్రగతిశీలురైన రైతులున్నారు.

అక్కడ మంచి వాతావరణం ఉంది. సుపరిపాలన ఉంది.

దేశంలోనే ఉత్తమ వ్యవసాయ రాష్ట్రంగా ఏపీని నిలపాలన్నదే మా సంకల్పం. అందుకే ప్రపంచశ్రేణి ప్రమాణాలను అందుకోవడానికి  ప్రయత్నిస్తున్నాం. దాన్ని సాధించి ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలబడాలన్నదే తుది ఆలోచన.

వ్యవసాయరంగంలో నాలెడ్జ్ బ్యాంక్ నెలకొల్పాలని భావిస్తున్నాం. ఏటికేడాది అభివృద్ధి సాధించి రానున్న ఇరవై సంవత్సరాలలో 20 శాతం వృద్ధి సాధించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాం.

ఈరంగంలో అందుబాటులోకి వచ్చిన వైజ్ఞానిక పరికరాలు, ఆధునిక సదుపాయాలన్నీ మేము వినియోగించుకుంటున్నాం.

వాస్తవ సమయంలో వర్షపాత నమోదు వివరాలు తెలుసుకోగలుగుతున్నాం. సాయిల్ మాయిశ్చర్ టెస్టింగ్ చేయిస్తున్నాం. డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నాం. త్వరలో మా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఫైబర్ గ్రిడ్ కనెక్టివిటీ అందించబోతున్నాం. దాని ద్వారా మీరు ఐయోవా నుంచి మా రైతులతో నేరుగా మాట్లాడవచ్చు.

.........

ఆఫ్రికా మంచి మార్కెట్ అని అభిప్రాయపడుతూ, ఐయోవా, ఏపీ ఆ ఖండానికి ప్రధాన విత్తన ఎగుమతిదారుగా ఉండబోతున్నాయని పేర్కొన్న ఐయోవా సైంటిస్టులు.


   ఐయోవా స్టేట్ యూనివర్సిటీ సీడ్ సైన్స్ సెంటరులో మెగా సీడ్ ప్రాజెక్టు రౌండ్ టేబుల్ సమావేశం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి ప్రసంగం..