"వైఎస్ జగన్ జీవిత చరిత్రను సినిమా రూపంలో చూపిస్తే..."

Header Banner

"వైఎస్ జగన్ జీవిత చరిత్రను సినిమా రూపంలో చూపిస్తే..."

  Thu Oct 12, 2017 22:43        India, Telugu

రాజకీయంగా సీఎం చంద్రబాబును ఎదుర్కోలేకే వైసీపీ నేతలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీస్తున్నట్లుందని టీడీపీ ఎమ్మెల్యే అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీపై అనిత స్పందించారు. డైరెక్టర్‌కు అనిత పలు సూచనలు చేశారు. ఎన్టీఆర్ మహానుభావుడు.. ఆయన పేదలకు, ప్రజలకు చేసిన మంచిని వర్మ తన సినిమాలో చూపించాలన్నారు.
జగన్ గురించి మాట్లాడుతూ..
చనిపోయిన ఎన్టీఆర్ పైన సినిమా తీసి టీడీపీని ఇబ్బంది పెట్టాలని వైసీపీ నేతలు అనుకుంటే... బ్రతికి ఉన్న వైఎస్ జగన్‌పై కూడా సినిమా తీసే వాళ్ళు కూడా ఉన్నారని అనిత చెప్పుకొచ్చారు. జగన్ జీవిత చరిత్రను ప్రజలకు సినిమా రూపంలో చూపిస్తే ఆయన పాదయాత్ర కూడా చెయ్యలేరన్నారు. మహానుభావుల్లో ఉన్న మంచినే తీసుకోవాలి.. అదే సమజాహితమని టీడీపీ ఎమ్మెల్యే అనిత మీడియాకు వివరించారు.


   "వైఎస్ జగన్ జీవిత చరిత్రను సినిమా రూపంలో చూపిస్తే..."