ముఖ్యమంత్రి కె దిక్కు లేదా? ఆయన కారు చోరీ...

Header Banner

ముఖ్యమంత్రి కె దిక్కు లేదా? ఆయన కారు చోరీ...

  Thu Oct 12, 2017 20:34        India, Telugu

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కారును ఎవరో దొంగిలించినట్లు సమాచారం.

ఓ వార్తా సంస్థ కథనం ప్రకారం ఆయన తన నీలి రంగు ‘వేగన్ ఆర్’ కారును ఢిల్లీ సచివాలయం వద్ద ఉంచారు.

 గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి ఆ కారు మాయమైంది.

 దానిని ఎవరు ఎత్తుకెళ్ళారో తెలియడం లేదు.

ఈ కారును ఆయన ఉద్యమకారుడిగా మారినప్పటి నుంచి వాడుతున్నారు.

అందువల్ల దీనిని ఆయన చాలా ప్రేమాభిమానాలతో వాడుకుంటున్నారు.


   ముఖ్యమంత్రి కె దిక్కు లేదా? ఆయన కారు చోరీ...