బాలీవుడ్ నటులతో టీం ఇండియా ఫుట్‌బాల్ మ్యాచ్..

Header Banner

బాలీవుడ్ నటులతో టీం ఇండియా ఫుట్‌బాల్ మ్యాచ్..

  Tue Oct 10, 2017 22:09        India, Sports, Telugu

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీం ఇండియా క్రికెటర్స్, బాలీవుడ్ నటులు ఆడనున్న ఫుట్‌బాల్ మ్యాచ్ తేదీలు, మ్యాచ్ వేదికలను ప్రకటించారు. విరాట్ కోహ్లీ టీం పేరు ఆల్‌ హార్ట్స్‌ ఎఫ్‌సీ అని ప్రకటించారు. ఆల్‌ స్టార్స్‌ ఎఫ్‌సీ జట్టుకు రణ్‌బీర్‌ కపూర్‌ నేతృత్వం వహించనున్నారు. అక్టోబర్ 15వ తేదీన ముంబైలోని అంధేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఫుల్‌బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ధోనీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కోహ్లీ చెప్పారు. పెద్ద మైదానాల్లో ఫుట్‌బాల్‌ మ్యాచ్ ఆడిన అనుభవం లేదని కోహ్లీ అన్నారు. విరాట్‌ కోహ్లీ ఫౌండేషన్‌ కోసం కోహ్లీ సేన ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతోంది. అభిషేక్‌ బచ్చన్‌ కోసం బాలీవుడ్‌ నటులు బరిలోకి దిగుతున్నారు.   బాలీవుడ్ నటులతో టీం ఇండియా ఫుట్‌బాల్ మ్యాచ్..