హైదరాబాద్‌లో మరో మూడు రోజులు భారీ వర్షాలు

Header Banner

హైదరాబాద్‌లో మరో మూడు రోజులు భారీ వర్షాలు

  Tue Oct 10, 2017 21:47        India, Telugu

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు వెల్లడించారు. వర్షాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీకి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్ఎమ్ఎస్‌ల ద్వారా తెలియజేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఉపరితల ఆవర్తనాలు ఏర్పడుతున్నాయని, మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితలం కొనసాగుతోందని, ఇది 3.6 కిలోమీటర్ల ఎత్తు ఆవరించి ఉందని అన్నారు. మరొక ఉపరితలం గల్ఫ్ ఆఫ్ సీయాం అనే ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, అది 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఆవరించి ఉందని చెప్పారు. ఈ ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినప్పడు అదే సమయంలో గాలిలో తేమ శాతం కూడా ఎక్కువ స్థాయిలో ఉంటుందని, పగటి పూట ఉష్ణోగ్రతల వేరియేషన్ తేడాల వల్ల వాతావరణంలో అస్థిరత ఏర్పడుతుందని, తద్వారా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వాటివల్ల 4, 5 రోజుల నుంచి ఎక్కువ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయని రాజారావు వెల్లడించారు. 2, 3 రోజులు తేలిక పాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆవర్తనాలు ఏర్పడడం తగ్గితే, వర్షాలు కూడా తగ్గుముఖం పడతాయని రాజారావు తెలిపారు.   హైదరాబాద్‌లో మరో మూడు రోజులు భారీ వర్షాలు