నాగచైతన్య-సమంత, అభిషేక్-ఐశ్వర్యరాయ్

Header Banner

నాగచైతన్య-సమంత, అభిషేక్-ఐశ్వర్యరాయ్

  Tue Oct 10, 2017 21:41        Cinemas, India, Telugu

నాగచైతన్య-సమంతల పెళ్లి సేమ్ టు సేమ్ అభిషేక్-ఐశ్వర్యరాయ్ పెళ్లిని తలపిస్తోంది. చైతూ-సమంత పెళ్లి తర్వాత అక్కినేని ఫ్యామిలీ, అమితాబచ్చన్ ఫ్యామిలీలను పరిశీలిస్తే, ఈ రెండు ఫ్యామిలీల మధ్య చాలా దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీ ఎలాగో, బాలీవుడ్‌లో బచ్చన్ ఫ్యామిలీకి అలాంటి పేరే ఉంది. స్టార్ హీరోయిన్ అయిన సమంతని నాగచైతన్య పెళ్లి చేసుకున్నట్లే, అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న ఐశ్వర్యరాయ్‌ని అభిషేక్ పెళ్లి చేసుకున్నాడు.

 

చాలా పెద్ద పోలిక ఏమిటంటే చైతూకి మొదటి హిట్ 'ఏ మాయ చేసావే'. ఇందులో హీరోయిన్ సమంత. ఇక బాలీవుడ్‌లో అభిషేక్ బచ్చన్ మొదటి హిట్ 'ధాయ్ అక్షర్ ప్రేమ్ కీ'. ఇందులో హీరోయిన్ ఐశ్వర్యరాయ్. అభిషేక్‌కి ఎంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉందో సేమ్ టు సేమ్ చైతూకి కూడా అంతే ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉంది. రెండూ లెజండ్రీ ఫ్యామిలీలే. ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య పోలికలను చెప్పుకోవచ్చు.

    నాగచైతన్య-సమంత, అభిషేక్-ఐశ్వర్యరాయ్