రైలులో ప్రసవించిన మహిళ..

Header Banner

రైలులో ప్రసవించిన మహిళ..

  Tue Oct 10, 2017 20:49        India, Telugu

లోకల్ రైలులో ప్రయాణిస్తుండగా 26 సంవత్సరాల ఓ మహిళ పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ నుంచి లోకల్‌ ట్రైన్‌లోని మహిళా కోచ్‌లో రాత్రి సమయంలో మహిళ ప్రసవించినట్లు వైద్యులు తెలిపారు. తల్లీబిడ్డలను వైద్యం కోసం సమీపంలోని కేమ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. రైలు ప్రయాణిస్తుండగా 26 ఏళ్ల మహిళా గర్భిణీకి నొప్పులు రావడంతో దాదర్‌ స్టేషన్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చిందని ‘వన్‌ రుపీ క్లినిక్‌’ వైద్యులు చెప్పారు.   Delivery-Train