పెట్రోల్ , డీజిల్‌పై 4 శాతం వ్యాట్‌ను త‌గ్గించిన మ‌హారాష్ట్ర..

Header Banner

పెట్రోల్ , డీజిల్‌పై 4 శాతం వ్యాట్‌ను త‌గ్గించిన మ‌హారాష్ట్ర..

  Tue Oct 10, 2017 20:30        India, Telugu

కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు పెట్రోల్‌, డీజిల్‌పై విధించే వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. రెండు ఇంధనాలపై వ్యాట్‌ను 4శాతం తగ్గిస్తున్నట్లు గుజరాత్‌ ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే మహారాష్ట్ర కూడా తగ్గించింది. అయితే.. ఎంత శాతం తగ్గిస్తున్నందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. పెట్రోల్‌పై రూ.2, డీజిల్‌పై రూపాయి తగ్గిస్తున్నట్లు మహారాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి.

         దీంతో ఆ రాష్ట్రంలో లీటరు పెట్రోల్‌ రూ.75.58, డీజిల్‌ రూ.59.55గా ఉండనుంది. ప్రస్తుతం మహారాష్ట్రలోని ముంబయి, నవీ ముంబయి, థానేల్లో పెట్రోల్‌పై 26% వ్యాట్‌, డీజిల్‌పై 24% వ్యాట్‌ను వసూలు చేస్తున్నారు. లీటరుకు రూ.2 తగ్గిండచం వల్ల ఆ రాష్ట్ర ఆదాయానికి రూ.2600కోట్ల మేర గండి పడనుంది. ఇటీవలే పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాలు కూడా తమ వంతుగా వ్యాట్‌ను తగ్గించాల్సిందిగా కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్‌ సూచనలు చేశారు. దీనిపై గుజరాత్‌, మహరాష్ట్ర స్పందించాయి.   Petrolrates-Maharastra