ఆక్స్‌ఫ‌ర్డ్‌లో తొలి ప్ర‌సంగం చేసిన మ‌లాలా...

Header Banner

ఆక్స్‌ఫ‌ర్డ్‌లో తొలి ప్ర‌సంగం చేసిన మ‌లాలా...

  Tue Oct 10, 2017 20:27        India, Telugu

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌ ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో తొలిసారి ప్రసంగించారు. ఈ విషయాన్ని మలాలా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘ఐదేళ్ల క్రితం బాలికల విద్య కోసం పోరాడుతున్న నన్ను కాల్పులతో అడ్డుకున్నారు. కానీ ఈరోజు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో తొలి ప్రసంగం చేశాను’ అంటూ ట్వీట్‌ చేశారు.పాకిస్థాన్‌కు చెందిన మలాలా బాలికల విద్య కోసం ఉద్యమం చేపట్టారు. ఈ నేపథ్యంలో 2012లో ఆమె పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా తాలిబన్లు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం లండన్‌కు తరలించారు. అప్పట్నుంచీ లండన్‌లోనే ఉంటూ చదువుకుంటున్నారు.

     ప్రపంచవ్యాప్తంగా బాలికల విద్య కోసం మలాలా అలుపెరుగని కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి శాంతి దూతగా ఉన్న ఆమె 2014లో నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్నారు. అంతేకాదు ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోని ప్రతి చిన్నారికి చదువుకునే హక్కుందంటూ ఆమె చేస్తున్న ప్రచారం ప్రశంసలు అందుకుంటోంది.

మలాలా ప్రస్తుతం ఆక్స్‌ఫర్ట్‌ యూనివర్శిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకనమిక్స్‌లో డిగ్రీ చదువుతున్నారు. పాక్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, బ్రిటన్‌ మాజీ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌, మయన్మార్‌ నేత అంగ్‌ సాన్‌ సూచీ తదితరులు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో ఇదే కోర్సు చదివారు.   Malal-Oxford