పది ఓవర్లకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా

Header Banner

పది ఓవర్లకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా

  Tue Oct 10, 2017 20:16        Sports, Telugu

రెండో టీ20లో ఆస్ట్రేలియా పట్టుబిగుస్తోంది. పది ఓవర్లకే ఐదు కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా పరుగుల కోసం శ్రమిస్తోంది. 60 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది. రోహిత్ శర్మ, కోహ్లీ, శిఖర్ ధవన్, మనీష్ పాండే‌లు పెవిలియన్ చేరిన వేళ క్రీజులోకి వచ్చిన ధోనీ ఆదుకుంటాడనుకుని అందరూ భావించారు. అయితే భారీ షాట్ కోసం ప్రయత్నించి జంపా బౌలింగ్‌లో అవుటయ్యాడు. ప్రస్తుతం కేదార్ జాదవ్, హార్ధిక్ పాండ్యా క్రీజులో ఉన్నారు.   5wickets-60runs