సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన ప్రముఖ సంస్థ..

Header Banner

సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన ప్రముఖ సంస్థ..

  Tue Oct 10, 2017 20:13        Gadgets, Telugu

వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రముఖ మొబైల్ సంస్థ షియోమీ సరికొత్త స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఎంఐ మిక్స్‌ 2 పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఎంఐ మిక్స్‌ 2 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 35,999గా నిర్ణయించామని కంపెనీ వెల్లడించింది. తక్కువ ధరల్లోనే పలు మోడళ్ల ఫోన్లను అందుబాటులోకి తెచ్చామని సంస్థ తెలిపింది. అక్టోబర్‌ 17 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌ ద్వారా ఫోన్లను కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది. నవంబర్‌ నుంచి రిటైల్‌ అమ్మకాలు చేపడతామని కంపెనీ స్పష్టం చేసింది.
 
ఎంఐ మిక్స్‌ 2 ఫీచర్లు ఇలా ఉన్నాయి...
5.99 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 12 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్‌, 3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఉంటుందని సంస్థ వెల్లడించింది.


   MI-Mix2