టెక్‌ దిగ్గజం ఆపిల్‌కు ఎదురుదెబ్బ

Header Banner

టెక్‌ దిగ్గజం ఆపిల్‌కు ఎదురుదెబ్బ

  Mon Oct 09, 2017 20:42        India, Technology, Telugu

 టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. కొత్త పన్ను విధానం కింద ఐఫోన్‌ తయారీదారి ఆపిల్‌కు పన్ను, డ్యూటీల పరంగా ఎలాంటి రాయితీలు అందించేది లేదని అధికారిక వర్గాలు చెప్పాయి. మేకిన్‌ ఇండియాను ప్రోత్సహిస్తున్నామని, దిగుమతులను కాదని పేర్కొన్నాయి. స్మార్ట్‌ఫోన్‌, వాటి దిగుమతి పార్ట్‌లపై కస్టమ్‌ డ్యూటీని ఇప్పటికే పెంచినట్టు పేర్కొన్నాయి. మేకిన్‌ ఇండియాను ప్రోత్సహించకుండా దిగుమతులను ప్రోత్సహించేది లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలుతో ఎవరికీ కూడా ప్రత్యేక రాయితీలను ఇచ్చేది లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. కూపర్టినోకు చెందిన ఐఫోన్‌, ఐప్యాడ్‌ తయారీదారి ఆపిల్‌ బారత్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేసేందుకు పలు రాయితీలను ఎప్పటినుంచో కోరుతోంది. 

       కస్టమ్‌ డ్యూటీలను తగ్గింపు మాత్రమే కాక, 30 శాతం స్థానిక వనరులనే నియమించుకోవాలనే నిబంధన నుంచి కూడా తమల్ని మినహాయించాలని టెక్నాలజీ దిగ్గజం అభ్యర్థిస్తోంది. ప్రపంచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా భారత్‌ పేరులోకి రావడంతో, ఆపిల్‌ దృష్టి ప్రస్తుతం భారత్‌పై పడింది. వ్యయాలను తగ్గించుకోవడానికి స్థానికంగా తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేయాలని కంపెనీ భావిస్తోంది. దీనికోసం పలు రాయితీలను ఆపిల్‌ ఎప్పటినుంచో కోరుతోంది. ఆపిల్‌కు భారత్‌లో పూర్తిగా తన సొంతమైన స్టోర్‌ లేదు. రెడింగ్టన్, ఇంగ్రామ్ మైక్రో వంటి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా తన ఉత్పత్తులను భారత్‌లో విక్రయిస్తోంది.    టెక్‌ దిగ్గజం ఆపిల్‌కు ఎదురుదెబ్బ