కొల్లం బ్రహ్మానందరెడ్డికి ఘన నివాళిలు అర్పించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కువైట్ సభ్యులు

Header Banner

కొల్లం బ్రహ్మానందరెడ్డికి ఘన నివాళిలు అర్పించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కువైట్ సభ్యులు

  Mon Oct 09, 2017 20:00        Associations, Kuwait, Telugu

కొల్లం బ్రహ్మానందరెడ్డికి ఘన నివాళిలు అర్పించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ  కువైట్ సభ్యులు 

మాలియా ప్రాంతములో ఉన్న పవన్ రెస్టారెంట్ లో రైల్వే కోడూరు నియోజక ఇంచార్చ్ స్వర్గీయ కొల్లం బ్రహ్మానందరెడ్డి గారి సంతాప సభ లో వై.యస్.ఆర్ సీపీ  కువైట్ సభ్యులు ఘన నివాళిలు అర్పించారు. ఈ సందర్భముగా గల్ఫ్. కువైట్, కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డి గారు మాట్లాడుతూ కోడూరు నియోజకవర్గంలో బ్రహ్మానందరెడ్డి గారి లేని లోటు ఎవ్వరు తీర్చలేరు అని సామాన్య కార్యకర్త నుండి నియోజకవర్గం ప్రతి ఒక్కరికి పేరుతో పిలిచే నాయకులు ఇక లేరు అంటే జీర్ణించుకోలేక పోతున్నారన్నారు.  పెద్దాయన స్వర్గీయ వై.యస్.రాజారెడ్డి  గారి నుండి దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ఒడిదుడుగులు ఎదురైనా రాజకీయపరంగా ఎన్ని కష్టలు వచ్చిన వై.యస్. కుటుంబంతోనే తన రాజకీయ పయనం చేసి వై.యస్.ఆర్. గారి మరణాంతరం కూడా వై.యస్.ఆర్. పై ఉన్న అభిమానంతో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతు కోడూరులో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి విజయాలు అందించిన బ్రహ్మానందరెడ్డి గారు లేని లోటు ఎవ్వరు తీర్చలేరన్నారు.

ఈ కార్యక్రమములో కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం. వి. నరసారెడ్డి, ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి, అధికార ప్రతినిధి ఆకులప్రభాకర్ రెడ్డి, బి.సి. ఇంచార్చ్ రమణ యాదవ్, సలహాదారుడు నాగిరెడ్డిచంద్రశేఖర్ రెడ్డి, యూత్ ఇంచార్చ్ మర్రి కళ్యాణ్, సోషల్ మీడియా ఇంచార్చ్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్టీ ఎస్సి ఇంచార్చ్ బి.ఎన్. సింహా, సాంస్కృతిక విభాగం ఇంచార్చ్ కె. వాసుదేవ రెడ్డి, సభ్యులు సయ్యద్ సజ్జాద్, ఎస్. రఫీఖ్ ఖాన్, ఆకుల చలపతి, యు. రమణారెడ్డి, మహబూబ్ బాషా, ఎస్. రహమతుల్లా, కె. హరినాధ్ నాయుడు, పి. రవి శంకర్, ఇక్బల్, హనుమంత్ రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.


   కొల్లం బ్రహ్మానందరెడ్డికి ఘన నివాళిలు అర్పించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కువైట్ సభ్యులు