ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక లావాదేవీల్లో కొత్త శకం... మాస్టర్ కార్డ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం.

Header Banner

ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక లావాదేవీల్లో కొత్త శకం... మాస్టర్ కార్డ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం.

  Thu Oct 05, 2017 21:13        అమరావతి కబుర్లు, Business, India, Telugu

ఆర్ధిక లావాదేవీల్లో కొత్త శకం.....మాస్టర్ కార్డ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం.

సురక్షితమైన డిజిటల్ ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కీలకమైన వేదిక కాబోతోంది.

విశాఖ ఫిన్ టెక్ కేంద్రంగా నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతున్న ప్రతిష్ఠాత్మకమైన మాస్టర్ కార్డ్  సంస్థ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఇక చేదోడు వాదోడుగా ఉండబోతోంది.

కాన్ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోగురువారం జరిగిన భారత ఆర్ధిక సదస్సులో   ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ ఐటీ సలహాదారు జె.ఏ.చౌదరీ, మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ భంగ  ఒప్పంద పాత్రలను మార్చుకున్నారు.

రైతులు సులభతరంగా డిజిటల్ లావాదేవీలు జరుపుకోవడం, సైబర్ భద్రతకు పలు కార్యక్రమాలు చేపట్టడం, మాస్టర్ కార్డ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వ్యాపార సదస్సులు నిర్వహించడం ఈ ఒప్పందంలోని ముఖ్య అంశాలు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ  విశాఖలో  ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్టెక్) తో అద్భుతాలు చేయవచ్చు అని అన్నారు.

విశాఖపట్నంలో ప్రతి ఒక్కరిని ఫిన్టెక్ వాలీకి ఆహ్వానించాలని,  అవినీతి వంటి పలు సమస్యలను డిజిటల్ ఎకానమీ పరిష్కరిస్తుందని ఆయన చెప్పారు.

భవిష్యత్ మొత్తం నవీన ఆవిష్కరణలతో కూడిన ఆర్థికవ్యవస్థకు మాత్రమే చోటు ఉంటుందని, దాన్ని ప్రతి ఒక్కరు అంది పుచ్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగ మాట్లాడుతూ టెక్నాలజీని అమలు చేయాలన్న  ముఖ్యమంత్రి ముందుచూపు రాష్ట్రాన్ని నూతన స్థాయికి తీసుకోవడంలో సహాయపడుతుందని అన్నారు.

ప్రతి సంవత్సరం విశాఖపట్నంలో మాస్టర్ కార్డ్ వ్యాపార సమ్మేళనాన్ని నిర్వహిస్తుందని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో సైబర్ భద్రత మరియు ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాల్లో పనిచేయడానికి మాస్టర్ కార్డ్ ముందుకు వచ్చింది.



మాస్టర్ కార్డ్ తో కుదిరిన ఒప్పందంలో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి.

అగ్రి-బిజినెస్, అగ్రి-ప్రాసెసింగ్ లో 2029కల్లా ఆంధ్రప్రదేశ్ అగ్రగామిలో ఉండడానికి తగు చర్యలు ఇక వేగవంతం చేయాలి.

కాలానుగుణంగా మారుతున్న సాంకేతిక పరిణామాల ఫలాలు  ప్రధానంగా రైతులకు తగు విధమైన ఆదాయ మార్గాలను పెంచాలి.

స్థానిక ఉపాధి అవకాశాలు పెంచడం,  మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అగ్రిబిజినెస్ చేపట్టడం దీని ద్వారా రైతు తలసరి ఆదాయం పెంచడం లక్ష్యం.

చిన్న రైతులు,స్వయంసహాయక గ్రూపులు, ఆహారోత్పత్తి సంస్థలు, కొనుగోలుదారులు, ఆర్థిక సంస్థలను ఒకే వేదిక పైకి తెచ్చి సమీకృత వ్యహం ద్వారా ఆర్థిక స్థితిగతులను పెంచాలి.

సాంకేతికతను అందిపుచ్చుకోవడమే కాకుండా సమాచార భద్రత, గోపనీయత కూడా ప్రస్తుత పరిస్థితుల్లో చాల కీలకమని ప్రభుత్వం భావించింది. అందువల్ల ఒప్పందంలో ఈ అంశంపై కూడా ప్రముఖంగా దృష్టి సారించింది.

వ్యాపార,డిజిటల్ లావాదేవీలు విస్తృతమవుతున్న నేపథ్యంలో వాటి భద్రత పై కూడా తగు అవగాహనా కార్యక్రమాలునిర్వహించేలా మాస్టర్ కార్డ్ చర్యలు చేపడుతుంది.

రాష్ట్రం బహుముఖ అభివృద్ధి సాధించడానికి పట్టణీకరణ చాల ముఖ్యమైన అంశమని.. దీని ద్వారా మాత్రమే మరింత సంపద పెరుగుతుందని ముఖ్యమంత్రి ఆలోచన.. ఇందుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎంపికైన స్మార్ట్ సిటీస్ తో పాటు, మరో 14పట్టణాలను కూడా ప్రత్యేకంగా గుర్తించి కొన్ని కార్యక్రమాలు చేపట్టాలన్నది ఈ ఒప్పందంలో పేర్కొన్న మరో అంశం.

వీటిని నగదు రహిత నగరాలుగా సురక్షితమైన ఆర్థిక లావాదేవీలకు అనువైన నగరాలుగా తీర్చి దిద్దే చర్యలను మాస్టర్ కార్డ్  సంస్థ చేపడుతుంది.

నవ్యంధ్రప్రదేశ్ రూపొందించడంలో నైపుణ్యం కలిగిన పనివంతులు, కొత్త అవకాశాలు అందిపంచుకోడానికి చొరవ చూపే వారి అవసారాన్ని గుర్తించిన ప్రభుత్వం .. మాస్టర్ కార్డ్ తో కలిసి ఆ దిశగా తగు వ్యూహాలను రూపొందిస్తుంది.



   ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక లావాదేవీల్లో కొత్త శకం... మాస్టర్ కార్డ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం.