కువైట్ లో రోజా విజయవంత పర్యటన సందర్భం గా కువైట్ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సభ్యుల అభినందన సభ... కువైట్ ప్రజల ఆదరాభిమానాలకు ఫిదా అయిన రోజా

Header Banner

కువైట్ లో రోజా విజయవంత పర్యటన సందర్భం గా కువైట్ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సభ్యుల అభినందన సభ... కువైట్ ప్రజల ఆదరాభిమానాలకు ఫిదా అయిన రోజా

  Thu Oct 05, 2017 19:53        Associations, Telugu

కువైట్ లో రోజా విజయవంత పర్యటన సందర్భం గా కువైట్ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సభ్యుల అభినందన సభ... కువైట్ ప్రజల ఆదరాభిమానాలకు ఫిదా అయిన రోజా  

కువైట్ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏర్పాటు నవరత్నాల సభ విజయవంతము అయిన సందర్భముగా  వైకాపా కువైట్ సేవాదళ్ సభ్యులు యు. రమణ రెడ్డి గారి ఆధ్వర్యములో సూక్ ముబారాకియ ప్రాంతములో అరబిక్ హోటల్ లో శ్రీమతి రోజా గారు  ఇండియా బయలుదేరి న రోజు  03 - 10 - 17 న  రోజా  గారికి కమిటీ సభ్యులకు విందు ఏర్పాటు చేశారని గల్ఫ్, కువైట్ , కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డి గారు తెలిపారు. ఈ సందర్భముగా రోజా గారు మాట్లాడుతూ మీరు చూపిన ఆదరాభిమానం ఎప్పటికి మరచిపోను పార్టీ పేరుతో కువైట్ లో మీరు చేస్తున్న సమాజిక సేవలు అభినందనీయమని, గల్ఫ్  సమస్యలను మా అధినేత జగన్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కొరకు మా పార్టీ అధికారంలో వస్తే తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇలియాస్, బాలిరెడ్డి గారు మాట్లాడుతూ నవరత్నాల కార్యక్రమం విజయవంతము చేసిన కమిటీ సభ్యులకు అభిమానులకు పేరు పేరున  కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. నవరత్న సభ గుర్తుగా కమిటీ తరపున సభ్యులు రోజా గారికి మేమెంటును అందచేశారు. ఈ కార్యక్రములో కో కన్వీనర్ యం. వి. నరసా రెడ్డి, గవర్నరింగ్ కౌన్సిల్ సభ్యులు పి. రెహమాన్ ఖాన్, ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి, మీడియా ఇంచార్చ్ ఆకుల ప్రభాకర్ రెడ్డి. బి. సి. ఇంచార్చ్ రమణ యాదవ్, సలహా దారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అన్నాజీ, సోషల్ మీడియా ఇంచార్చ్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, యూత్ ఇంచార్చ్ మర్రి కళ్యాణ్, సాంసృతిక  విభాగం  ఇంచార్చ్  కె. వాసుదేవరెడ్డి,  సభ్యులు ఆకుమర్తి లాజరస్, రమణ రెడ్డి, రఫీఖ్ ఖాన్, సయ్యద్ సజ్జాద్, బాలకృష్ణ  రెడ్డి,  గౌస్  బాషా,  ఆకుల చలపతి, మహాబూబ్ బాషా, తదితరులు పాల్గోన్నారు   కువైట్ లో రోజా విజయవంత పర్యటన సందర్భం గా కువైట్ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సభ్యుల అభినందన సభ... కువైట్ ప్రజల ఆదరాభిమానాలకు ఫిదా అయిన రోజా