కువైట్ లో క్యాన్సర్ తో భాధ పడుతూ 3 నెలలుగా ఆసుపత్రిలోనే ఉన్న భీమవరం మహిళ ను క్షేమం గా స్వగ్రామం చేర్చిన APNRT, కువైట్ ఎన్నారైస్.. హైదరాబాదు ఎయిర్ పోర్ట్ నుండి స్వగ్రామం వరకు నర్సు సహాయం ఉచిత అబులేన్సు లో చేర్చిన AP NRI శాఖ... రూ. 1,25,000 అందించిన దాతలు..

Header Banner

కువైట్ లో క్యాన్సర్ తో భాధ పడుతూ 3 నెలలుగా ఆసుపత్రిలోనే ఉన్న భీమవరం మహిళ ను క్షేమం గా స్వగ్రామం చేర్చిన APNRT, కువైట్ ఎన్నారైస్.. హైదరాబాదు ఎయిర్ పోర్ట్ నుండి స్వగ్రామం వరకు నర్సు సహాయం ఉచిత అబులేన్సు లో చేర్చిన AP NRI శాఖ... రూ. 1,25,000 అందించిన దాతలు..

  Thu Oct 05, 2017 14:05        Embassy Row, Helping Hand, Kuwait, Telugu

కువైట్ లో క్యాన్సర్ తో భాధ పడుతూ 3 నెలలుగా ఆసుపత్రిలోనే ఉన్న భీమవరం మహిళ ను క్షేమం గా స్వగ్రామం చేర్చిన APNRT, కువైట్ ఎన్నారైస్.. హైదరాబాదు ఎయిర్ పోర్ట్ నుండి స్వగ్రామం వరకు నర్సు సహాయం ఉచిత అబులేన్సు లో చేర్చిన  AP NRI శాఖ... రూ. 1,25,000 అందించిన దాతలు..

ఆమె పేరు సత్యవతి. ఊరు ఉండి భీమవరం, పచ్చిమ గదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని కువైట్ కు 4 సంవత్సరాల క్రితం వచ్చింది. కాయ కష్టం చేసుకొని ఉన్న ఒక్క కూతురిని చదివించుకుంది. గత సంవత్సరం తన భర్తను కుడా 1000 దీనార్లు ఖర్చు చేసి కువైట్ కు పిలిపించుకుంది. అతను వచ్చిన 3 నెలలు ఏ విధమైన పని దొరకక ఖాళీగానే ఉన్నాడు. తరువాత 3 నెలలు చిన్న చితక పనులకు వెళ్లి ఇక్కడ ఖర్చులు వెళ్ళ దీసాడు. ఈ లోపల తన భార్య ఆరోగ్యం క్షీనించడం మొదలైంది... తన పని వదులుకొని గత కొన్ని నెలలు గా తన భార్య ఆరోగ్యం కొరకు ఆసుపత్రుల చుట్టూ తిరగటం అతని పనైపోయింది.

గత 3 నెలలు గా ఆవిడ సభా ఆసుపత్రి లోని క్యాన్సర్ వార్డ్ చికిత్స పొందుతుంది. ఒక మేజర్ ఆపరేషన్ కూడా చేసారు. ఆ ఆపరేషన్ తరువాత ఎడమ చెయ్యి మరియు కాలు కుడా పని చేయడం మానేసాయి. కిమో తెరిపి కుడా చేసారు. ఈ విషయం తెలుసుకున్న కువైట్ ఎన్నారైస్ వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడం జరిగింది. డాక్టర్లను సంప్రదించగా ఆమెకు కిమో తెరిపి చేసామని, ఇకపై ఆమె శరీరం కిమో కి సహకరించదని, వెంటనే అమెను స్వగ్రామానికి పంప వలసినది గా తెలిపారు. ఈ పరిస్థితుల్లో వారి వద్ద చేతిలో చిల్లి గవ్వకుడా లేదు.

ఈ సందర్భం గా, ఇండియాకు వెళ్ళిన తరువాత తను ఆసుపత్రిలో చికిత్స చేసుకోవడాని కి కూడా చేతిలో ఒక్క పైసా కూడా లేదని దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తగిన సహాయం చేయవలసింది గా సత్యవతి భర్త శ్రీనివాసు కువైట్ ఎన్నారైస్ ద్వారా వేడుకోవడం జరిగింది.  

దీనికి వెంకట్ కోడూరి గారు స్పందించి తన స్నేహితుల సహాయం తో మొత్తం రూ. 75,000 జమ చేసి ఇచ్చారు. అదే విధంగా సత్యవతి కుటుంబ స్నేహితులు శ్రీ శ్రీనివాస రెడ్డి భార్య భర్తలకు హైదరాబాదు వరకు టికెట్ మరియు 100 దీనార్లు ఆర్ధిక సహాయం తో పాటు వారికీ తెలిసిన జహారలో ఉంటున్న స్నేహితులు మరి కొందరు ఇంకొక 200 దీనార్లు సహాయం అందించారు.

కువైట్ ఎన్నారైస్ సహాయ తో AP NRI శాఖ అద్వర్యం లోని ఉచిత అంబులెన్సు హైదరాబాదు నుండి ఉండి భీమవరం వరకు ఒక నర్సు మరియు అన్ని వసతులతో కూడిన అంబులెన్సు కొరకు కువైట్ ఎన్నారైస్ వారిని సంప్రదించగా AP NRI శాఖ సమయానికి అన్ని సమకూర్చి సత్యవతి కి సమయానికి కావాల్సిన మందులు, ఇంజక్షన్ లు ఇచ్చుకుంటూ జాగ్రత్త గా ఏ అసౌకర్యం కలుగకుండా ఏలూరు మెయిన్ ఆసుపత్రి కి తీసుకువెళ్ళి అక్కడ చేర్పించారు. తరువాత అక్కడ ప్రాధమిక చికిత్సలు చేసి వారిని డిశ్చార్జ్ చేసారు.

3 వ తేది ఎయిర్ ఇండియా విమానమ లో బయలుదేరే వారిని కువైట్ ఎయిర్ పోర్ట్ లో ఆకాంక్ష సేవా సమితి అధ్యక్షులు మల్లి కార్జున్, శ్రీనివాస్, మరియు ఇతర కార్యవర్గం, కువైట్ తెలంగాణా జాగృతి అధ్యక్షులు శ్రీ ముత్యాల వినయ్ కుమార్, కువైట్ ఆంధ్ర fb నిర్వాహకుడు రఘు రామి రెడ్డి, మరియు కువైట్ ఎన్నారైస్ ఎయిర్ పోర్ట్ లో కలిసి పరామర్శించి వెంకట్ శివ కోడూరు గారు సేకరించిన రూ. 75,000 చెక్ ను వారికీ అందించారు.      

ఈ సందర్భం గా కువైట్ ఎన్నారైస్ ప్రచురించిన వార్తకు సందించి సత్యవతి కుటుంబానికి, ప్రత్యక్షం గా, పరోక్షం గా, ఆర్ధికం గా చేయూత నిచ్చిన ప్రతి ఒక్కరికి, శ్రీ వెంకట్ కోడూరి మరియు వారి స్నేహ బృందానికి, ఆకాంక్ష సేవా సమితికి, కువైట్ తెలంగాణా జాగృతి కి, కువైట్ ఆంధ్రా fb కి, మరీ ముఖ్యం గా AP NRI శాఖ లోని ప్రతి ఉద్యోగి కి (కువైట్ ఎన్నారైస్ తో అబులేన్సు లో కావాల్సిన సౌకర్యాల గురించి, వారి ఇంటికి చేరే వరకు గంట గంటకు వివరాలు అందిస్తూ జాగ్రత్త గా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారు), APNRT మంగళ గిరి ఆఫీసు స్టాఫ్ కి అందరికి కువైట్ ఎన్నారైస్ అభినదనల తో కూడిన ధన్యవాదాలు తెలుపుకుంటుంది.

ఈ మొత్తం పక్రియలో ఒక విచారకరవిషయం ఏమంటే, సత్యవతి విషయం తెలుసున్న కువైట్ ఎన్నారైస్, వెంటనే ఎంబసీ అధికారులను సంప్రదించి వారి టిక్కెట్ కు అనుమతి తీసుకోవడం జరిగింది. కాని, అనుకోని రీతిలో ఎంబసీ కి వరుసగా 4 రోజులు సెలవలు వచ్చాయి. ఈ లోపు సత్యవతి ని అసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయడం, ఆమె పరిస్థితి బాగోక పోవడం తో ఆమె కుటుంబ స్నేహితులు నేరుగా టిక్కెట్ తీసుకోవడం జరిగింది. ఎంబసీ లో టిక్కెట్ కు తిరిగి డబ్బు చేలించే విధానం లేక పోవడం తో ఎంబసీ నుండి డబ్బులు తీసుకోలేక పోవడం విచారకరం. కాని సత్యవతి ని ఎయిర్ పోర్ట్ లో అమ్బులిఫ్ట్ (వీల్ చైర్ సౌకర్యానికి) 90 KD లు ఎంబసీ వారు ఇవ్వడం సంతోషకరం. కాని ఈ సౌకర్యం ఎయిర్ ఇండియా వారు ఉచితం గానే ఇచ్చరు. ఈ సందర్భం గా తోడ్పాటును ఇచ్చిన ఎంబసీ అధ్కికారులకు కూడా ప్రత్యెక కృతజ్ఞతలు.   కువైట్ లో క్యాన్సర్ తో భాధ పడుతూ 3 నెలలుగా ఆసుపత్రిలోనే ఉన్న భీమవరం మహిళ ను క్షేమం గా స్వగ్రామం చేర్చిన APNRT, కువైట్ ఎన్నారైస్.. హైదరాబాదు ఎయిర్ పోర్ట్ నుండి స్వగ్రామం వరకు నర్సు సహాయం ఉచిత అబులేన్సు లో చేర్చిన AP NRI శాఖ... రూ. 75,000 అందించిన దాతలు..