అలా చేస్తేనే కోహ్లీ గొప్ప కెప్టెన్ అవుతాడు: గంగూలీ

Header Banner

అలా చేస్తేనే కోహ్లీ గొప్ప కెప్టెన్ అవుతాడు: గంగూలీ

  Wed Oct 04, 2017 21:34        India, Sports, Telugu

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై తనకున్న అభిప్రాయాన్ని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. కోహ్లీ గొప్ప కెప్టెన్ అనడంలో సందేహం లేదని పేర్కొంటూనే వచ్చే పదిహేను నెలలు ఎంతో కీలకమని పేర్కొన్నాడు. ప్రస్తుత జట్టు టెస్టులు, వన్డేల్లో అగ్రస్థానంలో ఉందని, అయితే వచ్చే 15నెలల్లో కూడా అతడు నిరూపించుకోగలిగితే అతడు గొప్ప కెప్టెన్ అవుతాడని పేర్కొన్నాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదన్నాడు. రాబోయే 15 నెలల్లో టీమిండియా సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలతోపాటు ప్రపంచకప్ కూడా ఆడాల్సి ఉందని, ఈ సమయంలో కోహ్లీ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఈ పర్యటనల్లోనే కోహ్లీ తన ప్రపంచకప్ టీంను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుదని అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనే కోహ్లీకి అసలైన సవాలని పేర్కొన్నాడు.   Kohli - Ganguli