కువైట్ లో రోజా అరెస్తా? కాదా? YSRCP కువైట్ వివరణ... అసలు నిజం ఇదే...

Header Banner

కువైట్ లో రోజా అరెస్తా? కాదా? YSRCP కువైట్ వివరణ... అసలు నిజం ఇదే...

  Sun Oct 01, 2017 19:31        Associations, Kuwait, Telugu

మొన్న అనగా 29 సెప్టెంబరు రాత్రి కువైట్ కు విచ్చేసిన YSRCP నేత శ్రీమతి రోజా గారు కువైట్ లో వివిధ కార్యక్రమ్మాల్లో పాల్గొన్నారు. అయితే నిన్న అనగా 30 న జరిగిన కార్యక్రమం లో రోజా అరెస్టు అనే వార్తలు మీడియా లో విరివిగా వచ్చాయి. అయితే అసలు వాస్తావాలు ఈ విధం గా ఉన్నాయి.


 

నిన్న రాత్రి కువైట్ లో ని ఖైతాను ఏరియా లోని రాజధాని రెస్టారెంట్ లో YSRCP కువైట్ విభాగం వారు 500 మంది వరకు ఆహ్వానం పలికి విందు భోజనం ఏర్పాటు చేసారు. కానీ అనుకోని రీతిలో 3000 పైగా ఆమెను చూసేందుకు అదే మాల్ కు వచ్చారు. ఈ ఉహించని పరిణామం తో మాల్ యాజమాన్యం పోలీసులను పిలిచి కంట్రోల్ చేయవలసి వచ్చింది. పోలీసులను చూసి కొంత మంది ఆమెను అరెస్టు చేసారు అని అనుకోని సోషల్ మీడియాలో పెట్టగా ఆ వార్త విరివిగా ప్రచారం లోకి వచ్చి రాష్ట్ర ప్రింట్ మీడియా కు కుడా చేరింది.

దీనిపై వివరణ ఇస్తూ ఆ పార్టీ కన్వినర్ శ్రీ బాలి రెడ్డి గారు ఒక ప్రకటన విడుదల చేసారు. విడియో రూపం లో ఉన్న ప్రకటన లింక్ ఇక్కడ క్రింద మీ కోసం ఇవ్వడం జరిగింది. చూసి నిజాలు తెలుసుకో వలసినది గా వారు ప్రజానికానికి ఒక విజ్ఞప్తి చేసారు.


   కువైట్ లో రోజా అరెస్తా? కాదా? YSRCP కువైట్ వివరణ... అసలు నిజం ఇదే...