కువైట్ లో ఓబులవారి పల్లి మహిళ గుండెపోటు తో మృతి... చెన్నై కు పంపిన నూర్ బాష దూదేకుల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం... AP NRI మంత్రిత్వ శాఖ ఉచిత అంబులెన్సు లో స్వగ్రామం చేరిన మృత దేహం.

Header Banner

కువైట్ లో ఓబులవారి పల్లి మహిళ గుండెపోటు తో మృతి... చెన్నై కు పంపిన నూర్ బాష దూదేకుల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం... AP NRI మంత్రిత్వ శాఖ ఉచిత అంబులెన్సు లో స్వగ్రామం చేరిన మృత దేహం.

  Fri Sep 29, 2017 13:07        Associations, Embassy Row, Kuwait, Telugu

కువైట్ లో ఓబులవారి పల్లి మహిళ గుండెపోటు తో మృతి... చెన్నై కు పంపిన నూర్ బాష దూదేకుల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం... AP NRI మంత్రిత్వ శాఖ ఉచిత అంబులెన్సు లో స్వగ్రామం చేరిన మృత దేహం.

కడప జిల్లా ఓబులవారి పల్లి దగ్గర నూకన పల్లి మహిళ పెండి కట్ల ఫాతిమా గుండె పోటు తో ఈ నెల 25 న కువైట్, సులేభి ఖాత్ లోని తన నివాసం లో చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న భంధువులు సుంకేసుల రఫీ, N. ఇమామ్, V. బాష గార్లు ఇండియా నుండి నూర్ బాష దూదేకుల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నూర్ భాషా సలీం గారికి విషయ తెలుపగా, వారు మరియు వారి సభ్యులు కలిసి, దేహాన్ని స్వదేశానికి పంపడానికి ఆవసరంమయ్యే అన్ని పేపర్ వర్క్స్ పూర్తి చేసి నిన్న అనగా 28 న ఇండియా కు పంపించారు. ఈ సందర్భం గా ఈ పనుల నిమితం పూర్తి సమయ్యన్ని  వెచ్చించిన దస్తగిరి గారికి మరియు సహకరించిన వారందరికి  అధ్యక్షులు నూర్ భాషా సలీం గారు ప్రత్యెక అభినందనలు తెలియచేసారు.

అదే విధం గా చెన్నై ఎయిర్ పోర్ట్ నుండి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్సు కొరకు కువైట్ ఎన్నారిస్ AP NRI శాఖకు సంభదిత పేపర్ వర్క్స్ పూర్తి చేసి పంపగా వారు ఉచిత అంబులెన్సు ను సమకూర్చి వారి స్వగ్రామాలకు తరలించారు.  

గమనిక: విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ కు సంభందించిన వారు ఏదైనా అనివార్య కారణాలతో చనిపోతే వారి మృత దేహాన్ని చెన్నై లేదా హైదరాబాదు ఎయిర్ పోర్ట్ ల నుండి వారి స్వగ్రామాలకు ఉచితం గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తమ ప్రభుత్వ  ఖర్చులతో అంబులెన్సు సర్వీస్ ను అందిస్తుంది. ఈ అవకాశాన్ని సంభదిత వ్యక్తులు సద్వినియోగం చేసుకోవలసింది గా కువైట్ ఎన్నారైస్ విజ్ఞప్తి చేస్తుంది. ఈ సందర్భం గా ఈ అంబులెన్సు సర్విస్ కావాలని అనుకునే వారు (ప్రపంచంలో ఏ దేశం లో ఉన్నఆంధ్ర ప్రదేశ్ NRIS) కువైట్ ఎన్నారై ను సంప్రదిస్తే ప్రభుత్వ అధికారులతో సంప్రదించి అంబులెన్సు సర్వీసు ను అరేంజ్ చేస్తుంది.

ఈ విషయం ప్రతి ఒక్కరికి చేరే విధం గా షేర్ చేయండి, వారికి ఈ విషయం తెలియ చేయండి.

కువైట్ ఎన్నారైస్ కు email: kuwaitnris@kuwaitnris.com లేదా whats app కు లేదా డైరెక్ట్ గా +965 60905470 కు సంప్రదించండి. ఏ దేశం నుండి అయినా పర్వాలేదు. (2 రోజుల ముందు గా సంప్రదించిన, ఏ ఆటంకాలు లేకుండా అంబులెన్సు అరేంజ్ చేయబడుతుంది. గమనించ గలరు)

   కువైట్ లో ఓబులవారి పల్లి మహిళ గుండెపోటు తో మృతి... చెన్నై కు పంపిన నూర్ బాష దూదేకుల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం... AP NRI మంత్రిత్వ శాఖ ఉచిత అంబులెన్సు లో స్వగ్రామం చేరిన మృత దేహం.