‘మొదట ఆమె వల్ల అయితదా అన్నరు.. చివరికి...’

Header Banner

‘మొదట ఆమె వల్ల అయితదా అన్నరు.. చివరికి...’

  Tue Sep 26, 2017 20:35        Telugu, World

పన్నెండేళ్ల క్రితం జర్మనీకి ఆమె ఛాన్సలర్ గా ఎన్నికయినప్పుడు ఎవ్వరికి నమ్మకంచిక్కలేదు. ఈమె ఎక్కువ రోజులు అధికారంలో ఉండరని చాలా మంది ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఆమే ఏంజెలా మెర్కెల్. ఇప్పుడు జర్మనీకి నాలుగోసారి ఛాన్సలర్ గా ఎన్నికయ్యారు. యూరోపియన్ యూనియన్ ఊపిరి పీల్చుకుంది. బ్రేక్సిట్ తరువాత యూరోపియన్ యూనియన్ భవితవ్యంపై అనుమానాలు పెరిగాయి. నెథర్లాండ్స్...ఫ్రాన్స్ ఎన్నికల్లో యూనియన్ వ్యతిరేకులు ఓడిపోయారు. ఇప్పుడు మెర్కెల్ విజయంతో యూరోపియన్ యూనియన్ సమర్ధకులకు మద్దతు పెరిగింది. ప్రజాస్వామ్య దేశాల్లో రాజకీయ పార్టీలు ఏంజెలా మెర్కెల్ రాజకీయ జీవితం నుంచి నేర్చుకోవలసింది చాల ఉంది. కాకపోతే ఈసారి జర్మన్ ఎన్నికల్లో ఒక విచిత్రం జరిగింది. యాభయ్ ఏళ్ల తరువాత మొదటి సారిగా జాతీయ వాదులు పార్లమెంటులో అడుగుపెడుతున్నారు.
 రెండో ప్రపంచయుద్ధం ముగిశాక జర్మనీ రెండుముక్కలయింది. పారిశ్రామిక పునరుజ్జీవనంతో పశ్చిమ జర్మనీ ఆర్ధికంగా చాలా అభివృద్ధిచెందింది. 1990 బెర్లిన్ గోడ కూలింది... రెండు జెర్మనీలూ తిరిగి ఒక్కటయ్యాయి. అది మొదలు జర్మనీ ఐరోపాలోని ఆర్ధిక శక్తిగా ఎదుగుతూ వచ్చింది. రాజకీయంగా చూస్తే....ఏకాభిప్రాయంతోనే జర్మనీ ముందుకు సాగింది. డెబ్భయ్యేళ్ళ జర్మనీ చరిత్రలో నాలుగుసార్లు ఛాన్సలర్‌గా ఎన్నికైన మూడోవ్యక్తి ఏంజెలా మెర్కెల్. ఇదెలా సాధ్యమయింది...?
అది మాత్రం నిజం. ప్రతి పక్షానికి ఆమే ఏదీ మిగల్చరు. అందుకే సోషల్ డెమొక్రాట్లు ఆమెపై పిర్యాదు చేస్తుంటారు. తాము ఒక విధానం రూపొందించుకోడానికి మెర్కెల్ అసలు అవకాశమే ఇవ్వరన్నది వారి పిర్యాదు. ఇప్పుడుకూడా అంతే... మొదటి సారిగా అతి కుడివాద పార్టీ... జాతీయవాదుల పార్టీకి 90 కిపైగా సీట్లొచ్చాయి. ఈ పరిణామం మెర్కెల్‌ను ఆశ్యర్యపరిచింది. ఎన్నికల విజయం తరువాత మెర్కెల్ స్పందన కూడా అదే తీరులో ఉంది. ఆల్టర్‌నేటివ్ ఫర్ జర్మనీ పార్టీవారి డిమాండ్లు ఏమిటో మనం తెలుసుకోవాలి. ఆ సమస్యల పరిష్కారానికి నడుం కట్టాలి. వారి భయాలు పారదోలాలి అన్నారు మెర్కెల్.
ఎన్నికల ఫలితాలపై ఏంజెలా మెర్కెల్‌కు అసంతృప్తి ఉన్న మాట నిజమే. అందుకు కారణం యాబై ఏళ్ల తరవాత మొదటిసారి జాతీయవాదులు జర్మనీ పార్లమెంటులో అడుగుపెట్టారు. ఈ కారణంగానే ప్రస్తుత జర్మన్ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి. ఏంజెలా మెర్కెల్ నాలుగోసారి ఎన్నిక కావడం కూడా అందుకు మరో కారణం. ఈ ఎన్నికలు జర్మనీకి ఎలాంటి పాఠాలు నేర్పబోతున్నాయి....? ఐరోపా మీద ఈ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి...? అనేది భవిష్యత్తే చెప్పాలి.


   4th-wisechancelor