స్పైడర్ డబ్బుతో బెంజ్ కారు

Header Banner

స్పైడర్ డబ్బుతో బెంజ్ కారు

  Mon Sep 25, 2017 22:17        Cinemas, India, Telugu

హీరోయిన్లకు రియల్ లైఫ్ లో ఒక్కొక్కరికి ఒక్కో ఎలిమెంట్ నచ్చుతుంది. రెజీనాకు దుస్తులంటే పిచ్చి, సమంతకు వంటలంటే ఇష్టం. అలానే రకుల్ కు కొత్త కార్లు అంటే ఇష్టం. తనకోసం ఎప్పుడూ ఏదో ఒక కారును రెడీగా ఉంచుకుంటుంది రకుల్. ఈసారి కూడా అదే పని చేసింది. బెంజ్ ఎస్.యు.వి సిరీస్ కు చెందిన హై-ఎండ్ కారును కొనుక్కుంది రకుల్. ఆ కారుతో ఓ ఫొటో దిగి ఇన్ స్టాగ్రామ్ లో కూడా పెట్టింది. ఇదే నా లేటెస్ట్ లవ్ అంటూ ట్వీట్ కూడా చేసింది.

తాజా సమాచారం ప్రకారం స్పైడర్ సినిమా చేసినందుకు వచ్చిన రెమ్యునరేషన్ తో ఈ కారు కొనుక్కుందట రకుల్. నిజానికి ఈ సినిమా కొనుగోలు కోసం షాపులు తిరిగేంత టైమ్ ఆమెకు లేదు. ఎఁదుకంటే ప్రస్తుతం స్పైడర్ ప్రమోషన్ లో బిజీగా ఉంది. అందుకే రకుల్ కుటుంబ సభ్యులే ఆమె డబ్బుతో ఢిల్లీలో ఈ కారు కొనుగోలు చేశారు. దాన్ని హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు. ఆ కారే ఇప్పుడు మీరు చూస్తున్నారు.   స్పైడర్ డబ్బుతో బెంజ్ కారు