కళ్లముందే కుప్పకూలిన విమానం

Header Banner

కళ్లముందే కుప్పకూలిన విమానం

  Mon Sep 25, 2017 21:37        India, Telugu

సముద్ర తీరంలో ఎయిర్‌ షో జరుగుతోంది.. గగనతలంలో వైమానిక విన్యాసాలు చూసేందుకు వేల సంఖ్యలో జనం అక్కడకు చేరుకున్నారు. ఇంతలో ఓ విమానం ఒక్కసారిగా సముద్రంలో కుప్పకూలిపోయింది. కళ్లముందే విమానం కూలిపోవడంతో వీక్షకులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఇటలీలో చోటుచేసుకుంది.

       ఇటలీ రాజధాని రోమ్‌కు 110 కిలోమీటర్ల దూరంలో టెరాసినా సముద్రతీరంలో ఆదివారం ఎయిర్‌ షో జరిగింది. ఇటలీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన పలు విమానాలు ఈ ప్రదర్శనలో పాల్గొని విన్యాసాలు చేశాయి. ఈ ఎయిర్‌షోను తిలకించేందుకు వేల సంఖ్య పర్యాటకులు సముద్రతీరానికి చేరుకున్నారు. ఇంతలో మిలిటరీ విభాగానికి చెందిన యూరోఫైటర్‌ జెట్‌ ఒకటి సముద్రంలో కూలిపోయింది. విమానం తుదిదశ విన్యాసం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్‌ మృతిచెందాడు. ఘటన జరిగిన వెంటనే అధికారులు గాలింపు చర్యలు చేపట్టి పైలట్‌ మృతదేహాన్ని వెలికితీశారు. అయితే విమానం కూలడానికి గల కారణాలు తెలియరాలేదని విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.    కళ్లముందే కుప్పకూలిన విమానం